News Pillar
Provides Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

అరాచకానికి-అభివృద్దికి మధ్య ఎన్నిక

హుజూర్ నగర్ ఉప ఎన్నిక అరాచకానికి, అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నికని పీసిసి చీఫ్, నల్డొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు. హుజూర్ నగర్  వెనుకబాటు తనానికి తానే కారణమన్న  కేటీఆర్ కు అవగాహన లోపం ఉందని.. స్థానిక విషయాలేమీ కేటీఆర్ కు తెలియవని   అన్నారు. కేటీఆర్ కు స్క్రిప్ట్ రాసిన వాళ్ళు  పనికిరాని వాళ్ళు అని తేలిపోయిందని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. భారత దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కడా లేని అభివృద్ధి హుజూర్ నగర్ లో జరిగిందని చెప్పారు. ప్రస్తుతం పోటీ చేేస్తున్న టీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి ఊళ్ళో కూడా తానే అభివృద్ధి చేశానని ఉత్తమ్ తెలిపారు. టీఆర్ ఎస్ పార్టీ నాయకులు కేవలం పోలీస్ స్టేషన్లను అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని.. ఇసుక దందా, మట్టి దందా, భూమాఫియా లకు పాల్పడుతూ.. అమాయక గిరిజనులు, రైతులు, కాంగ్రేస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి  జైళ్లలో పెడుతున్నారని ఆరోపించారు. 2014లో టీఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ఎక్కడా  అభివృద్ధి జరగలేదని అన్నారు.

- Advertisement -

టీఆర్ ఎస్ ప్రభుత్వ అసమర్ధత, చేత గాని తనం వల్ల మిషన్ భగీరధ పనులతో అద్భుతంగా ఉన్న సిమెంట్ రోడ్లన్నీ ద్వంసం అయ్యాయని ఉత్తమ్ ఆవేధన వ్యక్తం చేశారు. అంతే కాదు హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఒక్క ఊళ్ళో కూడా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని గుర్తు చేశారు. హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో నిర్మాణంలో ఉన్న 4 వేల ఇళ్ల గురించి శాసనసభలో అడగంతో పాటు, నాటి జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్, జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని మండిపడ్డారు. హుజూర్ నగర్ లో రోడ్లు నిర్మించడంతో పాటు, ప్రభుత్వ కార్యాలయాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టించినవేనని ఉత్తమ్ చెప్పారు. రాబోవు రోజుల్లో హుజూర్ నగర్ ను స్మార్ట్ సిటీగా మారుస్తానని హామీ ఇచ్చారు. హుజూర్ నగర్ నుంచి పద్మావతి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్న ఉత్తమ్.. ఒక్క ఓటు.. ఇద్దరు ఎమ్మెల్యేలుగా పనిచేస్తామని స్పష్టం చేశారు. పాలకీడు మండలంలో కాల్వ చివరి భూములు 20 వేల ఏకరాలకు కొత్త లిప్ట్ నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చారు. జగ్గయ్యపేట నుండి మిర్యాలగూడ వరకు పాసింజర్ రైలు నడిపించేందుకు కృషి చేస్తానని చెప్పారు. హజూర్ నగర్ నియోజక వర్గంలో  సూపర్ స్పెషల్టీ హాస్పిటల్ నిర్మిస్తానని ఉత్తమ్ హామీ ఇచ్చారు. అటు మిర్యాలగూడ నుండి కోదాడ వరకు రోడ్డు నిర్మాణం పనులు వేగవంతం చేయిస్తానని ఉత్తమ్ స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.