News Pillar
Provides Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

వీరులకు కన్నీటి వీడ్కోలు

పుల్వామాలో గురువారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్ల పార్థివ దేహాలు స్వస్థలానికి చేరుకున్నాయి. ముష్కరుల చేతిలో వీరమరణం పొందిన జవాన్లకు యావత్‌ దేశమంతా కన్నీటి వీడ్కోలు పలికింది. అమర జవాన్వ కుటుంబసభ్యులు, బంధువుల అశ్రు నయనాల మధ్య వారి వారి స్వస్థలాల్లో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సీఆర్పీఎఫ్‌ ఏఎస్‌ఐ మోహన్‌లాల్‌ పార్థివ దేహాం డెహ్రాడూన్‌కు చేరుకోవడంతో ఆయన కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. తండ్రి మృతదేహానికి వీరజవాన్ మోహన్‌లాల్‌ కూతురు కడసారిగా సెల్యూట్‌ చేసింది.

pulwama

- Advertisement -

జాలువారుతున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఆ చిన్నారి తండ్రికి సెల్యూట్‌ చేసిన తీరు అందరిని తీవ్రంగా కలిచివేసింది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని తిర్వా కన్నౌజ్‌ ప్రాంతంలో వీర జవాను ప్రదీప్‌ కుమార్‌ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. వేలాది మంది స్థానికులు ఈ అంతిమ యాత్రలో పాల్గొని ఘనంగా వీడ్కోలు పలికారు. బిహార్‌లో సీఆర్పీఎఫ్‌ జవాన్లు రతక్‌ కుమార్‌ ఠాకూర్‌, సంజయ్‌ కుమార్‌ సిన్హా పార్థివ దేహాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ నివాళులర్పించారు. ఉగ్రదాడిలో అమరులైన 40 మంది వీర జవాన్ల అంతిమ యాత్రల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.

Leave A Reply

Your email address will not be published.