News Pillar
Provides Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

హుజూర్ నగర్ లో కాంగ్రెస్ దే గెలుపు

హుజుర్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పాలనలో మాత్రమే అభివృద్ధి చెందిందని పీసిసి చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హుజూర్ నగర్ అభివృద్దిలో టీఆర్ ఎస్ పాత్రను, సహకారాన్ని చూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటామని ఉత్తమ్ సవాల్ విసిరారు. 2009 లో హుజుర్‌నగర్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత తక్కువ వోల్టేజ్ సమస్యను పరిష్కరించడంతో పాటు.. అద్వాన్నమైన రోడ్లను బాగు చేశామని ఆయన గుర్తు చేశారు. 130 కేవి లేదా 13/11 కేవి సబ్ స్టేషన్లు లేనందున 12 ఉప సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. హుజుర్‌నగర్ టౌన్, ఫణిగిరి మండలంలో బలహీన వర్గాల కోసం దాదాపు 4 వేల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించినట్లు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో దాదపు 200 కోట్ల రూపాయలతో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు దాదాపు 80శాతం పూర్తయ్యాయని ఆయన అన్నారు. అయితే టిఆర్‌ఎస్ ప్రభుత్వం గత ఆరేళ్లలో మిగిలిన 20శాతం పనులను పూర్తి చేయలేకపోయిందని ఉత్తమ్ మండిపడ్డారు.

ప్రతీకారం తీర్చుకోవడం వల్ల టిఆర్ఎస్ ప్రభుత్వం హుజుర్ నగర్ లో ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. హుజుర్ నగర్ ఎమ్మెల్యేగా తాను నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. ఇక కాంగ్రెస్ పాలనలో హుజుర్‌నగర్‌లో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు ఉత్తమ్ తెలిపారు. కాంగ్రెస్ పాలనలో నెరెడెచెర్లా-కోడాడ-ఖమ్మం మార్గంలో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం జరిగిందని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో అనేక పాఠశాలలు స్థాపించబడ్డాయని చెప్పిన ఉత్తమ్.. ఇందులో కస్తూర్బా స్కూల్ కూడా ఉందని తెలిపారు. అందుకని హుజూర్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ది చెందిందని.. ఈ ఉప ఎన్నికలో ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాననే ఉంటారని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.