Vishal

అరెస్ట్ చేసే ముందు ఆలోచించాల్సింది 

చంద్రబాబుకే అలా జరిగిందంటే ఇక సామాన్యుడి సంగతేంటి హీరో విశాల్‌

స్పెషల్ రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్ట్‌ తీరుపై తమిళ నటుడు విశాల్‌ (Vishal) స్పందించారు. చంద్రబాబుకే అలా జరిగిందంటే సామాన్యుడికి భయమేస్తుందని ఆయన అన్నారు. బుధవారం హైదరాబాద్‌ లో  ఏర్పాటు చేసిన తన కొత్త మూవీ మార్క్‌ ఆంటోని (Mark Antony) సక్సెస్‌ మీట్‌ లో హీరో విశాల్‌ పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్ట్ గురించి మీడియా ప్రశ్నించగా.. ఓ కేసు విషయంలో చంద్రబాబును రిమాండ్‌ కు పంపిచారు.. నేను ఇక్కడ ఓటు వేయలేదు.. తమిళనాడులో ఓటు వేశా. కానీ, ఓ వ్యక్తిగా మాట్లాడాల్సి వస్తే.. చంద్రబాబును అరెస్ట్‌ చేసే ముందు వారు బాగా ఆలోచించాల్సిందని విశాల్ అన్నారు.

అంతే కాదు.. చంద్రబాబులాంటి వ్యక్తికే ఇలా జరిగిందంటే నాలాంటి సామాన్యుడికి భయమేస్తుంది.. మూవీ ప్రచారంలో బిజీగా ఉండటం వల్ల ఆ పరిణామాలను నేను లోతుగా పరిశీలించలేదు.. చివరకు న్యాయమే గెలుస్తుందనే నమ్మకం ఉంది.. అని విశాల్ చెప్పారు. విశాల్‌, ఎస్‌.జె. సూర్య (SJ Suryah) ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ అధిక్‌ రవిచంద్రన్‌ తెరకెక్కించిన మూవీ మార్క్‌ ఆంటోని. టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా అదే పేరుతో తెలుగులోనూ సెప్టెంబరు 15న రిలీజైంది. తమిళంతో పాటు తెలుగులోను మంచి టాక్ రావడంతో చిత్ర బృందం హైదరాబాద్ లో సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ లో విశాల్‌ తో పాటు ఎస్‌.జె. సూర్య, తెలుగు నటుడు సునీల్‌ తదితరులు పాల్గొన్నారు. అన్నట్లు మార్క్ ఆంటోనీ మూవీలో సునీల్ కీలక పాత్రపోషించారు.


Comment As:

Comment (0)