మాస్ మహారాజ రవితేజ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
టాలీవుడ్ నటుడు, మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని.. తన క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు రవితేజ. త్వరలోనే సినిమా ూటింగ్ కు సంబందించిన సెట్ లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని రవితేజ ట్విట్టర్-ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. రవితేజ ట్వీట్ పై అభిమానులు, నెటిజన్లు స్పందిస్తూ.. గెట్ వెల్ సూన్ అని కామెంట్స్ పెడుతున్నారు.
రవితేజ తన తాజా సినిమా షూటింగ్ లో స్వల్పంగా గాయపడ్డారు. ఐతే ఆ గాయాన్ని ఏ మాత్రం లెక్క చేయకుండా నిరంతరం షూటింగ్ లో పాల్గొనడంతో అది తీవ్రమైంది. దీంతో ఆపరేషన్ తప్పనిసరి అని డాక్టర్లు సూచించడంతో కుడి చేతికి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరిగింది. ఈ సందర్బంగా ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు రవితేజకు సూచించారు. వర్కింగ్ టైటిల్ ‘#RT75’ సినిమా షూటింగ్ లో భాగంగా గురువారం ఈ ప్రమాదం జరిగింది. ఈ సినిమాతో రైటర్ భాను భోగవరపు డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. అన్నట్లు ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.