Rashmika Mandanna

 సందడిగా గం. గం.. గణేశా ప్రీరిలీజ్ ఈవెంట్

ఆనంద్‌.. నన్ను ఇలా ఇరికిస్తే ఎలా- రష్మిక మందన 

సినిమా రిపోర్ట్- ఆనంద్దేవరకొండ (Anand Devarakonda) హీరోగా డైరెక్టర్ ఉదయ్బొమ్మిశెట్టి తెరకెక్కించిన సినిమాగం. గం.. గణేశా’ (Gam Gam Ganesha) . ప్రగతి శ్రీవాస్తవ, నయన్సారిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. మే 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సందర్భంగా సోమవారం చిత్ర బృందం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ఈవెంట్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి రష్మిక మందన (Rashmika Mandanna) ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. గం. గం.. గణేశా సినిమా మంచి విజయం సాధించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్బంగా ఆనంద్దేవరకొండ అడిగిన పలు ప్రశ్నలకు రష్మిక మందన సరదాగా సమాధానాలిచ్చారు.

ఆనంద్-రష్మికల సంబాషన ఎలా సాగిందంటే…

ఆనంద్దేవరకొండ-   మీకు బాగా ఇష్టమైన టూరిస్ట్ప్లేస్‌?
రష్మిక మందన-  వియత్నాం 

ఆనంద్‌-  మీతో కలిసి నటించిన హీరోల్లో మీ ఫేవరెట్‌?

రష్మిక-  ఆనంద్నువ్వు నా ఫ్యామిలీ.. ఇలా ఇరికిస్తే ఎలా? అంటూనే రౌడీ బాయ్‌ (విజయ్దేవరకొండ) అని చెప్పారు.

ఆనంద్‌-  మా చిత్రంలో గణేశుడిది కీలక పాత్ర. ఆయన గురించి మీరేం చెబుతారు..

రష్మికనేను దేవుణ్ని నమ్ముతా. పూజలు ఎక్కువగా చేస్తుంటా. వినాయక చవితి ఎప్పుడూ ప్రత్యేకమే

ఆనంద్‌-  మీ ఫ్రెండ్స్లో బెస్ట్ఫొటో గ్రాఫర్ఎవరు?

రష్మిక-  నేనే. నీ ఫొటో కూడా తీశా. కానీ, ఎవరూ క్రెడిట్ఇవ్వలేదు.

గం. గం.. గణేశా ప్రీరిలీజ్ ఈవెంట్ లో రష్మిక మందన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.

 


Comment As:

Comment (0)