KCR Power

మరిన్ని వివరాలు ఇవ్వాలని కోరిన కమీషన్

మాజీ సీఎం కేసీఆర్‌కు నరసింహా రెడ్డి కమిషన్‌ మరో లేఖ

హైదరాబాద్‌ రిపోర్ట్- తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు హయాంలో విద్యుత్‌ కొనుగోళ్లపై విచారణ చేస్తున్న జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ (Justice Narsimha Reddy) మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు (KCR) మరో లేఖ రాసింది. రాష్ట్రంలో విద్యుత్‌ కొనుగోళ్ల అంశంపై మరింత సమాచారం ఇవ్వాలని ఈ నెల 19న లేఖ రాసిన నర్సింహా రెడ్డి కమీషన్.. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణంపై మరిన్ని వివరాలు ఇవ్వాలని తాజా లేఖలో పేర్కొంది. 

అంతే కాకుండా ఛత్తీస్‌గఢ్‌ నుంచి కొన్న విద్యుత్‌ గురించి మరింత సమాచారం తెలియజేయాలని కమీషన్ కేసీఆర్ ను కోరింది. జస్టిస్ నర్సింహా రెడ్డి కమిషన్‌ ముందు పలువురు లేవనెత్తిన సందేహాలను సైతం కేసీఆర్ కు రాసిన లేఖలో ప్రస్తావించింది. వాటిపై ఈ నెల 27 లోపు సమాధానమివ్వాలని కేసీఆర్ కు సూచించింది నర్సింహా రెడ్డి కమిషన్‌.


Comment As:

Comment (0)