భువనేశ్వరికి ధైర్యం చెప్పిన చంద్రబాబు
పెళ్లి రోజే జైలుకు చంద్రబాబు - కోర్టులో కన్నీటి పర్యంతమైన భువనేశ్వరి
విజయవాడ రిపోర్ట్- టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన సతీమణి నారా భువనేశ్వరి (Bhuvaneshwari) కన్నీటిపర్వంతం అయ్యారు. తమ పెళ్లి రోజునే భర్తకు రిమాండ్ విధిస్తూ తీర్పు రావడంతో ఏసీబీ కోర్టులో ఒక్కసారిగా బోరున విలపించారు. చంద్రబాబు, భువనేశ్వరిల పెళ్లి రోజైన సెప్టెంబరు 10 ఆదివారం న ఇద్దరూ కలిసి విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవాలని అనుకున్నారట. ఐతే అంతకు ఒకరోజు ముందే చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంతో భువనేశ్వరి ఒక్కరే శనివారం విజయవాడ వచ్చి కనకదుర్గ అమ్మవారి దర్శించుకున్నారు. తమ పెళ్లి రోజైన ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు భువనేశ్వరి చంద్రబాబుతో పాటు ఏసీబీ కోర్టులోనే ఉన్నారు. చంద్రబాబుకు కోర్టు 14 రోజుల రిమాండు విధించడంతో భువనేశ్వరి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. బోరున విలపించారు. భార్య భునేశ్వరిని ఓదార్చిన చంద్రబాబు నిబ్బరంగా ఉండాలని ధైర్యం చెప్పారు.