ప్రదలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్న ముఖ్యమంత్రి

ప్రగతి భవన్‌ లో వినాయక చవితి వేడుకలు- సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

ప్రగతి భవన్ రిపోర్ట్- తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌ (Pragathi Bhavan) లో వినాయక చవితి వేడుకలు  ఘనంగా జరిగాయి. ప్రగతి భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి విగ్రహానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR), శోభ దంపతులతో పాటు మంత్రి కేటీఆర్‌ (KTR), శైలిమ దంపతులు ప్రక్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు విఘ్నేశ్వరుడు సుఖశాంతులను అందించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కోరారు. విఘ్నాలు తొలగించి ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో ఎలాంటి విఘ్నాలూ రాకుండా చూడాలని ముఖ్యమంత్రి ప్రార్థించారు. గణపతి పూజా కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలు, ప్రగతి భవన్ సిబ్బంది పాల్గొన్నారు.


Comment As:

Comment (0)