CM Revanth A

ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేసే అవకాశం ఉంది- సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో కొంతమంది ఎమ్మెల్యేల పదవులకు ప్రమాదం లేకపోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పారు. వారి శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. అసెంబ్లీ లోని తమ కార్యాలయంలో రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయలేదా అని ఈ సందర్బంరగా రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో తనను రోజూ అసెంబ్లీలో కూర్చోనివ్వలేదని.. గుర్తు చేసుకున్నారు. తన దగ్గరకు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి కలిసి వెళ్లారని రేవంత్రెడ్డి తెలిపారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మోసం అనే పదానికి మారుపేరని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టంగా సభలో చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సునితా లక్ష్మారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి వెళ్తే తనపై రెండు కేసులు పెట్టారని మండిపడ్డారు. బీఆర్ఎస్ లోకి వెళ్లిన సునీతా లక్ష్మారెడ్డి తనపై ఉన్న కేసులు కూడా తీయించలేదని ఆవేధన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో చర్చ సందర్బంగా తాను సబితా ఇంద్రారెడ్డి పేరు ఎక్కడా తీయలేదన్న సీఎం.. ఆమెను సొంత అక్కలా భావించానని చెప్పుకొచ్చారు.

తనను కాంగ్రెస్లోకి ఆహ్వానించిన సబితా ఇంద్రారెడ్డి తాను పార్టీలో చేరగానే బీఆర్ఎస్ లోకి వెళ్లారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మల్కాజిగిరి ఎంపీ టికెట్ తీసుకో నేను పనిచేస్తా అని చెప్పి.. టికెట్ రాగానే బీఆర్ఎస్ లోకి వెళ్లి షాక్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో సబితకు మాట్లాడే అవకాశం ఇచ్చామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆమె వ్యక్తిగత ప్రస్తావన తెస్తే మిగిలింది తాను చెప్పానని అన్నారు. అసలు కేసీఆర్, హరీశ్రావు అసెంబ్లీకి ఎందుకు డుమ్మా కొట్టారని ప్రశ్నించిన రేవంత్.. సబిత ఆవేదన చూసైనా కేసీఆర్, హరీశ్రావు అసెంబ్లీకి రావాలి కదా అని నిలదీశారు.


Comment As:

Comment (0)