వరుస ట్వీట్లు చేస్తున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా
చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మరో ఆసక్తికర ట్వీట్
స్పెషల్ రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసును వాదిస్తున్న సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా (Sidharth Luthra) వరుస ట్వీట్స్ తో ఆసక్తి రేకెత్తిస్తున్నారు. చంద్రబాబు క్వాష్ పిటీషన్ కొట్టివేయడం, రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇవ్వడంతో తాజాగా ట్విట్టర్ వేదికగా మరో పోస్ట్ పెట్టారు సిద్ధార్థ లూథ్రా. ప్రతి రాత్రి తర్వాత ఉషోదయం ఉంటుంది.. అది మన జీవితాల్లోకి కొత్త వెలుగులను మోసుకొస్తుంది.. అని శుక్రవారం ట్వీట్ చేశారు.
చంద్రబాబు తరఫున హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టేసిన నేపథ్యంలో లూథ్రా ఈ ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబందించి చంద్రబాబు కేసును వాదిస్తునప్పటి నుంచి సిధ్దార్థ్ లూథ్రా వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. తమకు ఎదురవుతున్న అవమానాలను, అపహాస్యాన్ని పట్టించుకోవద్దన్న స్వామి వివేకానంద వ్యాఖ్యలను ఓ పోస్ట్ లో ప్రస్తావించారు. అన్ని ప్రయత్నాలూ చేసినా న్యాయం కనుచూపుమేర కనిపించనప్పుడు కత్తి పట్టడమే సరైందని, పోరాటమే శరణ్యం అంటూ లూథ్రా చేసిన మరో ట్వీట్ సైతంరాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపున సంగతి తెలిసిందే.