Chandramukhi2

భారీ అంచనాలతో విడుదలవుతున్న చంద్రముఖి-2 

చంద్రముఖి-2 మూవీకి సెన్సార్‌ పూర్తి.. రన్‌టైమ్‌ ఎంతంటే?

మూవీ రిపోర్ట్- చంద్రముఖి-2 (Chandramukhi 2) సెన్సార్ పూర్తి చేసుకుంది. రాఘవ లారెన్స్‌ (Lawrence Raghava), కంగనా రనౌత్‌ (Kangana Ranaut) ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి 2 కు ప్రముఖ డైరెక్టర్ పి.వాసు దర్శకత్వం వహించారు. చంద్రముఖి-2 సెప్టెంబర్‌ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబందించిన సెన్సార్‌ పనులు పూర్తయ్యాయి. ఈ మేరకు చంద్రముఖి-2 చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్టర్ ద్వార తెలిపింది.

చంద్రముఖి-2 సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఇక చంద్రముఖి-2 మూవీ ఫైనల్‌ రన్‌ టైమ్‌ 157నిమిషాలు అంటే 2గంటల 37నిమిషాలు వచ్చింది. చంద్రముఖి-2 లారెన్స్‌ రాఘవ మొదటి పాన్‌ ఇండియా సినిమాగా చెప్పవచ్చు. బాలీవుడ్‌ హీరోయిన్ కంగనా రనౌత్‌ ఈ సినిమాలో రాజనర్తకిగా కీలక పాత్ర పోషించింది. దీంతో చంద్రముఖి-2 సినిమాపై దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ ఆసక్తి నెలకొంది. సూపర్ స్టార్ రజనీకాంత్‌ , జ్యోతిక, నయనతార నటించిన చంద్రముఖి (Chandramukhi) 2005లో ఎంతటి ఘన విజయం సాదించిన సంగతి తెలిసిందే. చంద్రముఖికి సీక్వెల్‌గా ఇప్పుడు చంద్రముఖి 2 మూవీ తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన చంద్రముఖి-2 ట్రైలర్‌ తో పాటు పాటలు అందరి అంచనాలను పెంచేయగా.. సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

 


Comment As:

Comment (0)