తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య
హైదరాబాద్ -కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ అల్వాల్ లోని పంచశీల కాలనీలోని ఇంట్లో గురువారం రాత్రి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారామె. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి, కేసు నమోదు చేసుకొని ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు.
12 సంవత్సరాల క్రితం రూపదేవిని ప్రేమించి వివాహం చేసుకున్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. రూపాదేవి మేడ్చల్ జిల్లాలోని మునిరాబాద్ లోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కొంపల్లిలోని పేట్ బషీరాబాద్ లోని దవేరియా విల్లాస్ లో చాలా కాలం నివాసం ఉండే సత్యందంపతులు.. నెల రోజులు క్రితమే అల్వాల్ లోని పంచశీల కాలనీ రోడ్ నెంబర్ 12 లోకి మారారు
ఎమ్మెల్యే సత్యం, రూపదేవి దంపతులకు కుమారుడు యోజిత్ (11 ) , రిషిక శ్రీ (9) కుమార్తె ఉన్నారు. గత కొంతకాలంగా ఎమ్మెల్యే దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. భార్య మృతిని తట్టుకోలేక హాస్పటల్లో స్పృహ తప్పి పడిపోయారు ఎమ్మెల్యే సత్యం. సత్యం భార్య రూపా దేవి మృతిని తెలుసుకొని కొంపెల్లి లోని రెనోవా ఆస్పత్రిలో ఉన్న ఎమ్మెల్యే ను పరామర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్.