Chiranjeevi 157

ట్వీట్ చేసిన డైరెక్టర్ద వశిష్ఠ

చిరంజీవి 157 స్టార్ట్..  డైరెక్టర్ వశిష్ఠ ట్వీట్‌..

మూవీ రిపోర్ట్- మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానులకు శుభవార్త. చిరుంజీవి 157 మూవీకి సంబందించిన అప్ డేట్ వచ్చేసింది. బింబిసార (Bimbisara) దర్శకుడు వశిష్ఠ (Vassishta) డైరెక్షన్ లో చిరంజీవి ఓ సినిమా చేయనున్న సంగతి తెలుసు కదా. ఇదిగో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంపార్టెంట్ న్యూస్ ను అభిమానులతో పంచుకున్నారు వశిష్ఠ. మెగా సినిమాకు మెగా ఆరంభం. ప్రీ ప్రొడెక్షన్‌ వర్క్‌తో #MEGA157 మొదలైంది. త్వరలోనే మీ అందరినీ సినిమాటిక్‌ అడ్వెంచర్‌ లోకి తీసుకువెళ్లేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.. అని డైరెక్టర్ వశిష్ట చెప్పారు.  

సినిమాటోగ్రాఫర్‌ చోటా కె నాయుడు, యూవీ నిర్మాతలు తాజాగా చిరంజీవిని కలవగా.. అందుకు సంబంధించిన ఓ ఫొటోని వశిష్ఠ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా తరువాత నటిస్తోన్న మూవీ కావడంతో అందరి దృష్టి ఈ ప్రాజెక్టుపై పడింది. సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ సినిమా కధ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో చిరంజీవి సరసవ అనుష్క శెట్టి, మృణాల్‌ ఠాకూర్‌ నచించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్.


Comment As:

Comment (0)