శ్రీశైలానికి పోటెత్తిన పర్యాటకులు
శ్రీశైలంలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
తెలంగాణలో కృష్ణా నది ఉరకలేస్తోంది. కృష్ణా పరివాహక ప్రాంతాల్లోకురుస్‌తున్న వర్షాలతో ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేేరుతోంది. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరిచారు. శ్రీశైలం ప్రాజెక్టు 5 గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి నీటిని క్రిందకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోని 5 గేట్లను ఎత్తిన నీటిపారుదల శాఖ అధికారులు.. 81 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేశారు. ప్రాజెక్టులోని ఒక్కో గేటు నుంచి 27 క్యూసెక్కుల చొప్పున.. 5 గేట్ల నుంచి మొత్తం 81 క్యూసెక్కుల నీరు పరవళ్లు తొక్కుతూ దిగువకు ప్రవహిస్తోంది.
పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మను చూసేందుకు పర్యాటకులు భారీ ఎత్తున శ్రీశైలం వస్తున్నారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవడంతో పాటు ప్రాజెక్టు నుంచి ఉరకలేస్తూ క్రిందకు దూకుతున్న కృష్ణను చూసి పరవసించిపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో శ్రీశైలం ఘాట్ రోడ్డు కిక్కిరిసిపోయింది. గతంలో 2022లో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. అదిగో ఆ తరువాత రెండేళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద చేరి నిండటంతో నీటిని క్రిందకు విడుదల చేశారు.
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, జులై 29వ తేదీ నాటికి 179.89 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులవ్వగా, ఎగువన కురుస్తున్న వర్షాల నేపధ్యంలో ప్రాజెక్టులో నీటిమట్టం 878.40 అడుగులకు చేరింది. పైన ఉన్న జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీనికి తోడు ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం వస్తూ ఉండటంతో మొత్తం మూడు గేట్లను ఎత్తి దిగువలకు నీటిని విడుదల చేశారు అధికారులు.