ఇంట్రస్టింగ్ గా భారతీయుడు 2 ట్రైలర్
మూవీ రిపోర్ట్- విశ్వ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan), స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్లో 28 ఏళ్ల క్రితం 1996 లో వచ్చిన హిట్ సినిమా భారతీయుడు. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో దానికి సీక్వెల్ గా రూపొందిన భారతీయుడు 2 (bharateeyudu 2) జులై 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా భారతీయుడు-2 చిత్ర బృందం ట్రైలర్ ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.
దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిని అంతమొందించడానికి సేనాపతి (కమల్ హాసన్) ఈసారి ఏం చేశాడో తెలియాలంటే భారతీయుడు-2 సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషించారు. 2.38 నిమిషాల నిడివి ఉన్న భారతీయుడు-2 ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తిరేపుతోంది.(Indian 2)