డ్రెస్సింగ్ రూమ్‌లో సన్‌రైజర్స్ ఆటగాళ్లను ఓదార్చిన కావ్య మారన్
స్పోర్స్ట్ రిపోర్ట్- ఐపీఎల్ (IPL 2024) 17వ సీజన్ లో కోల్‌కతా నై్ రైడర్స్ (Kolkata Knight Riders) తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sun Risers Hyderabad) ఘోర పరాజయం పాలైంది. ఈ సీజన్‌లో అద్భుతమైన ఆటతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. కీలకమైన ఫైనల్‌లో కేవలం రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫైనల్ మ్యాచ్ తరువాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లతో పాటు జట్టు సహ యజమాని కావ్య మారన్ (Kavya Maran) భావోద్వేగానికి గురయ్యారు. ఒక దశలో కావ్య కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ఐచే కాసేపటికి తేరుకున్నాక డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి ఆటగాళ్లను ఓదార్చారామె. ఐపీఎల్ 17వ సీజన్ మొత్తం జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచిందని, అందుకే ఫైనల్స్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచినా అందరు సన్‌రైజర్స్ హైదరాబాద్ గురించే మాట్లాడుకుంటున్నారని కావ్య మారన్ చెప్పుకొచ్చారు.