అద్భుతం చేసిన హైదరాబాద్ చిత్రకారిణి-ఒక చిత్రంతో 54 ప్రపంచ రికార్డులు
హైదరాబాద్ కు చెందిన చిత్రకారిణి సోనాలి ఆచార్జీ (sonali acharjee) ఒక చిత్రం ద్వార ఏకంగా 54 ప్రపంచ రికార్డులు సొంతం చేసుకున్నారు. 54 గంటల్లో 9.3 అడుగల పొడవు, 7.3 అడుగుల వెడల్పుతో కలియుగ ప్రత్యక్ష్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రపఠాన్ని మండల ఆర్ట్‌తో వేశారు సోనాలి ఆచార్జీ. గతంలో నటుడు చిరంజీవి జీవితంపై చిన్న పుస్తకం వేసిన హిమజకు 50 రికార్డులు రాగా, ఇప్పుడు సోనాలి ఆచార్జీ ఏకంగా 54 రికార్డులు సాధించారు. చిన్ననాటి నుంచి తాను ఒడిస్సి నృత్యకారిణినని సోనాలి చెప్పారు. ఐతే మోకాలికి శస్త్ర చికిత్స కావడంతో వైద్యులు నృత్యం ఆపాలని సూచించడంతో ఆ తరువాత తనకు తెలిసిన చిత్రలేఖనం మళ్లీ మొదలుపెట్టానని ఆమె తెలిపారు. ఆయా సంస్థల నుంచి పత్రాలను నేషనల్, ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్స్ ఆర్గనైజేషన్స్ సమన్వయకర్త లయన్ డా.కేవీ రమణారావు, ముఖ్య అతిథి డా.సముద్రాల వేణుగోపాలచారి సోనాలి ఆచార్జీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆమె గురువు స్వామి, సినీ నటుడు శ్రీనివాస్ పసునూరి, విశ్రాంత ఐఏఎస్ అధికారి సబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఒకే చిత్రానికి ఇన్ని రికార్డులు పొందటం అభినందనీయమన్నారు.