Roja Celebration

తన నివాసంలో సంబరాలు చేసుకున్న రోజా

చంద్రబాబు రిమాండు - స్వీట్స్ పంచిని మంత్రి రోజా

తిరుపతి రిపోర్ట్- తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తలరించారు. చంద్రబాబు రిమాండు నేపథ్యంలో చిత్తూరు జిల్లా నగరిలోని (Nagari) తన నివాసంలో సీనియర్ నచి, మంత్రి రోజా (Roja) ఆదివారం రాత్రి సంబరాలు చేసుకున్నారు. తన ఇంటి ముందు బాణసంచా పేల్చారు. అందరికి స్వీట్స్ పంచి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏపీ స్కిల్ డెంవలప్మెంట్ కేసులో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నారా లోకేశ్‌ పాత్రధారులైతే రోజులు లెక్కపెట్టుకోవాలని ఎద్దేవా చేశారు రోజా. చంద్రబాబు తప్పులన్నింటికీ రిటన్‌ గిఫ్ట్‌ వస్తుందని కామెంట్ చేశారు మంత్రి రోజా. చంద్రబాబు అరెస్ట్ నేపధ్యంలో సంబరాలు చేసుకున్న రోజా కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Comment As:

Comment (0)