ప్రధాని మోదీకి చేతకావడం లేదన్న సీఎం కేసీఆర్
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్
కొల్లాపూర్ రిపోర్ట్- తెలంగాణలో మరో ప్రతిష్టాత్మకమైన సాగునీటి పధకం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రారంభించారు. నార్లాపూర్ (Narlapur) వద్ద తొలి పంపు స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. అంతకు ముందు డెలివరి సిస్టర్న్ వద్ద సీఎం, మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా జలాలు నింపిన కలశాలకు వేద పండితులు పూజలు చేశారు. కలశాలను పలు గ్రామాల సర్పంచ్ లకు అధికారులు అందజేయనున్నారు. కృష్ణా జలాలతో పలు గ్రామాల్లో దేవుళ్లకు ప్రజాప్రతినిధులు పూజలు చేయనున్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, మహేందర్ రెడ్డితో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఆ తరువాత కొల్లాపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.
ఈ సందర్బంగా ప్రతి పక్ష పార్టీలపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొల్లాపూర్ (Kollapur) నియోజకవర్గానికి వరాల జల్లు కురుపించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చమంటే ప్రధాని మోదీకి చేతకావటం లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఇంటి దొంగలే మనకు ప్రాణగండం తెచ్చారని కేసీఆర్ విమర్శించారు. పదవులకు ఆశపడి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులను ఎవరూ ప్రశ్నించలేదన్న కేసీఆర్.. మనం ఎత్తులో ఉన్నాం నీళ్లు రావని.. ఈ జిల్లా నేతలే మాట్లాడారని అన్నారు. మన నీళ్లు ఏపీకి తరలివెళ్తుంటే ఈ జిల్లా నేతలే జెండాలు ఊపారని చెప్పారు. దత్తత తీసుకున్న ముఖ్యమంత్రులు కూడా ఈ జిల్లాలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు కేసీఆర్. చేతనైతే బీజేపీ నాయకులు ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లి నీటి వాటా అడగాలని చెప్పారు. Palamuru Rangareddy Lift Irrigation Project