Newspillar
Newspillar
Thursday, 08 Aug 2024 00:00 am
Newspillar

Newspillar

జన్మభూమి.. ఈ పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు(Chandrababu). అవును సమైఖ్య ఆంధ్రప్రేదేశ్ రాష్ట్రంలో తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. అందులో జన్మభూమి కార్యక్రమం ఒకటి. పారశుధ్య, పచ్చదనం వంటి కార్యక్రమాలలో ప్రజలనిు సైతం భాగస్వాములను చేయడమే జన్మభూమి ముఖ్యఉద్దేశ్యం. జన్మభూము కార్యక్రమం అప్పట్లో సంచలనం సృష్టించడంతో పాటు ఎంతో విజయవంతం అయ్యింది. ఇదిగో ఇప్పుడు మరోసారి ఆంధ్రప్రేశ్ లో జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్దమవుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో జన్మిభూమి (Janmabhoomi) గురించి చర్చించారు. త్వరలోనే ‘జన్మభూమి-2’ను ప్రారంభించాలని నిర్ణయించారు. నైపుణ్య గణనను దేశంలోనే మొట్టమొదటిసారి ఏపీలో చేపట్టాలనే అభిప్రాయానికి వచ్చారు చంద్రబాబు. మరోవైపు త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలని పొలిట్ బ్యూరో సమావేశంలో నర్ణయించారు. ఇక జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని భావిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

పేదరిక నిర్మూలనపై టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో విస్తృత చర్చించారు. త్వరలోనే మొదటి దశ నామినేటెడ్‌ పదవుల భర్తీ చేపట్టాలనే అభిప్రాయానికి నేతలు వచ్చారు. మిత్ర పక్షాలు బీజేపీ, జనసేన కు సైతం నామినేటెడ్ పదవులు ఇవ్వాలి కాబట్టి ఎక్కడా ఇబ్బందులు రాకుండా, ఎవ్వరిని నొప్పించకుండా పదవుల పంపకాలు జరపాలని , అందుకు జాగ్రత్తగా కసరత్తు చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.