ఇంటర్నేషనల్ రిపోర్ట్- భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) సూర్యుడి రహస్యాలను శోధించేందుకు చేపట్టిన మొట్టమొదటి మిషన్ ఆదిత్య ఎల్-1 (Aditya L1) ప్రయోగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆదిత్య ఎల్-1 ఉపగ్రహ కక్ష్యను పెంచి సూర్యుడి దిశగా ట్రాన్స్- లగ్రేంజియన్ పాయింట్-1 (Trans-Lagrangian Point 1) దిశలో విజయవంతంగా ప్రవేశపెట్టారు ఇస్త్రో శాస్త్రవేత్తలు. ఈ ప్రక్రియకు సంబంధించి ఇస్రో తాజాగా ట్విటర్‌లో పోస్టు చేసింది. అత్యంత కీలకమైన ట్రాన్స్-లగ్రేంజియన్ పాయింట్ లో ఆదిత్య ఎల్-1 ను సక్సెస్ ఫుల్ గా ప్రవేశపెట్టినట్లు పేర్కొంది.
ప్రస్తుతం ఆదిత్య ఎల్-1 వాహక నౌక (Space Carft) లగ్రాంజ్ (Langrnge) పాయింట్-1 దిశగా వెళ్తోంది. ఇప్పటికే ఈ ఉపగ్రహ భూకక్ష్యను నాలుగుసార్లు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా ఐదోసారి కక్ష్యను పెంచి సూర్యుడి దిశలోని లంగ్రాజ్ పాయింట్-1 వైపు వెళ్లేలా చర్యలు చేపట్టింది ఇస్రో. మొత్తం 110 రోజుల ప్రయాణం తరువాత ఆదిత్య ఎల్-1ను మరొక విన్యాసంతో లగ్రాంజ్ పాయింట్-1 చుట్టూ ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. పీఎస్‌ఎల్‌వీ సీ-57 వాహకనౌక ద్వారా ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని చేపట్టింగి ఇస్రో. భూమి నుంచి 15 లక్షల కిలో మీటర్ల దూరంలో ఉన్న లగ్రాంజ్ పాయింట్-1 చేరాక దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించనుంది ఆదిత్య ఎల్ -1. ((Aditya L1))