Newspillar
Newspillar
Thursday, 02 May 2024 00:00 am
Newspillar

Newspillar

బెంగళూరు రిపోర్ట్- మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, కర్ణాటక ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) సంచలన ఆరోపణలు చేశారు. ప్రజ్వల్ సుమారు 400 మంది మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, అంతే కాకుండా వారి వీడియోలు చిత్రీకరించాడని రాహూల్ ఆరోపించారు. అటువంటి వ్యక్తికి ఓట్లు వేయాలని కోరిన ప్రధాని నరేంద్ర మోదీ దేశ మహిళలకు క్షమాపణలు చెప్పాలని రాహూల్ గాంధీ డిమాండ్‌ చేశారు. కర్ణాటకలోని శివమొగ్గలో జరిగిన లోక్ సభ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రాహూల్ గాంధీ.. ప్రజ్వల్‌ రేవణ్ణను మాస్‌ రేపిస్ట్‌ (Mass Rapist) గా అభివర్ణించారుఇది సెక్స్‌ కుంభకోణం కాదన్న రాహూల్ గాంధీ.. ఇది అతిపెద్ద అత్యాచార ఘటన (Mass Rape) అని అన్నారు. ప్రజ్వల్‌ రేవణ్ణ దాదాపు 400 మంది మహిళలపై అఘాయిత్యానికి (Rape) పాల్పడి, వారి వీడియోలు చిత్రీకరించాడని చెప్పారు.

భీజేపీ కూటమి ఓట్లు అడుగుతున్నప్పుడు ప్రజ్వల్‌ రేవణ్ణ ఏం చేశాడో ప్రతీ మహిళ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజ్వల్‌ రేవణ్ణ గురించి ప్రధాని నరేంద్ర మోదీకి ముందే తెలుసన్న రాహూల్.. అటువంటి వ్యక్తికి కర్ణాటక వేదికగా మోదీ మద్దతు పలికారని మండిపడ్డారు. అటువంటి వ్యక్తికి ప్రచారం చేసినందు ప్రధాని మోదీ సహా అమిత్ షా, బీజేపీ నేతలు దేశంలోని ప్రతీ మహిళకు క్షమాపణలు చెప్పాలని రాహూల్ గాంధీ డిమాండ్‌ చేశారు. ఇక జేడీఎస్ హసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై లైంగిక దౌర్జన్యం అభియోగాలపై కేసు నమోదైంది. పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. అంతే కాకుండా ఈ కేసు విచారణకు హాజరుకావాలని వీరిద్దరికీ సిట్‌ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.