ప్రకటించిన నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్
రజనీకాంత్ - లోకేశ్ క్రేజీ కాంబినేషన్ లో సినిమా
మూవీ రిపోర్ట్- సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కు సంబందించిన మరో క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. జైలర్ (Jailer) సినిమా సూపర్ డూపర్ సక్సెస్ కావడంతో రజనీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో రజనీకాంత్ కు సంబందించిన తదుపరి సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ప్రముథ తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రజనీకాంత్ ఓ సినిమా చేయనున్నారంటూ గతంలో ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ.. రజనీకాంత్ తన తదుపరి సినిమాను లోకేశ్ కనగరాజ్‌తోనే చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోమవారం అధికారికంగా ప్రకటించింది. రజనీకాంత్ 171వ మూవీగా ఇది తెరకెక్కనుంది.
ఇక ఈ క్రేజీ కాంబినేషన్ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ స్వరాలు అందించనున్నారు. రజనీకాంత్ తో సినిమా చేయనుండటంపై లోకేశ్ కనగరాజ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక లోకేశ్ కనగరాజ్ ఖైదీ సినిమాతో తన సత్తా ఎంటో అందరికి చూపించారు. ఆ తరువాక విక్రమ్ మూవీ సక్సెస్ తో దక్షిణాదిలో లోకేశ్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దక్షిణాదిలో పలువురు స్టార్ హీరోలు లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ తో లియో సినిమాను తెరకెక్కిస్తున్నారు లోకేశ్ కనగరాజ్.