Sai Pallavi

తన పెళ్లి వార్తలపై స్పందించిన సాయి పల్లవి

నిజంగా ఇది నీచమైన చర్య.. పెళ్లి రూమర్స్‌పై సాయిపల్లవి ట్వీట్‌

మూవీ రిపోర్ట్- తన పెళ్లిపై వస్తున్న వదంతులు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై నటి సాయి పల్లవి (Sai pallavi) స్పందించారు. ఏ మాత్రం వాస్తవం లేని ఈ వార్తలపై ఆమే తీవ్ర ఆవేధన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా సాయి పల్లవికి పెళ్లైపోయిందని. సాయి పల్లవిని పెళ్లి చేసుకుంది ఓ డైరెక్టర్ అని, అతను ఇతనే అని కొన్ని ఫోటోలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కొందరు. మరీ ముఖ్యంగా యూట్యూబ్‌ ఛానళ్లు, ఫేస్ బుక్ లో సాయి పల్లవి పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ రాజ్‌కుమార్‌ పెరియస్వామితో ఆమె ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ, సాయిపల్లవి పెళ్లి చేసుకున్నారంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

ఈ క్రమంలో సాయి పల్లవి సైతం ట్విట్టర్ వేదికగా తన పెళ్లిపై వస్తున్న ఉహాగానాలను చెక్ పెట్టారు. సాధారణంగా ఐతే సినిమా ఇండస్ట్రీలో తనపై వచ్చే రూమర్స్‌ పై సాయి పల్లవి పెద్దగా పట్టించుకోదు. ఐతే ఈ సారి ఆమె పెళ్లికి సంబందించి కుటుంబ సభ్యులను, స్నేహితులను కూడా ఇందులోకి లాగుతుండటంతో ఆమె రెస్పాండ్ అయ్యారు.

తన పెళ్లి వార్తలపై సాయి పల్లవి ఏంచప్పారంటే.. నిజం చెప్పాలంటే, ఇలాంటి రూమర్స్‌ ను నేను అసలు పట్టించుకోను.. కానీ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మేంబర్స్ ను కూడా ఇందులో భాగం చేస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్పందిస్తున్నాను. నేను నటించిన ఓ మూవీ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను క్రాప్‌ చేసి, నీచమైన ఉద్దేశాలతో కేవలం డబ్బు కోసం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి పనికిమాలిన విషయాలపై స్పందించడం నిజంగా బాధగా ఉంది.. ఒక వ్యక్తికి ఇలాంటి ఇబ్బందిని కలిగించడం నిజంగా నీచమైన చర్యే.. అంటూ సాయి పల్లవి తీవ్ర ఆవేధన వ్యక్తం చేశారు.

 

 


Comment As:

Comment (0)