ప్రత్యమ్నాయ వ్యామగాములను తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్న నాసా
ఫిబ్రవరి 2025 వరకు అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) ఇప్పట్లో భూమిపైకి తిరిగి వచ్చేలా కనిపించడం లేదు. మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లిన సునీతా సాంకేతిక కారణాలతో రోజుల తరబడి అక్కడే చిక్కుకుపోయారు. కేవలం ఎనిమిది రోజుల మిషన్ లో భాగంగా సునీత విలియమస్, విల్మోర్ జూన్ 6వ తేదీన బోయింగ్ స్టార్లైనర్ క్యాప్సుల్ (Boeing Starliner capsule) వ్యామనౌకలో అంతర్జీతాయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. తిరిగి వీళ్లిద్దరు జూన్ 14న భూమికి రావాల్సి ఉండగా, వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. స్టార్లైనర్ క్యాప్సుల్ లో హీలియం లీకేజీ కారణంగా గత రెండు నెలలుగా వీరిద్దరూ స్పేస్ లోని ఉండిపోవాల్సి వచ్చింది.
గత రెండు నెలలుగా స్టార్లైనర్ క్యాప్సుల్ లో నెలకొన్న సంకేతిక సమస్యల పరిష్కారానికి నాసా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలిచడం లేదు. ఈ క్రమంలోనే సునీత విలియమస్, విల్మోర్ లు మరో ఎనిమి నెలల పాటు అంతరిక్షంలోనే ఉండాల్సి వస్తుందని పరోక్షంగా తెలిపింది నాసా. బోయింగ్ స్టార్ లైనర్ తిరిగి భూమ్మీద ల్యాండ్ అయ్యేందుకు అవకాశం లేకపోతే.. వ్యోమగాములను తీసుకొచ్చేందుకు ఎంచుకున్న ఆప్షన్లలో ఒకటి 2025 ఫిబ్రవరిలో ఉందని నాసా ప్రకటించింది. అది కూడా బోయింగ్ స్టార్లైనర్ క్యాప్సుల్ లో కాకుండా ఎలన్ మస్క్ కు చెందిన స్పేక్స్ఎక్స్ క్రూ డ్రాగన్ (Crew Dragon) వ్యోమనౌకలో తీసుకువస్తామని తెలిపింది నాసా.
సునీత విలియమస్, విల్మోర్ వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సేఫ్ గా ఉన్నారని, వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేశామని నాసా స్పష్టం చేసింది. ఐతే మరోవైపు స్పేస్ లో ఇలా ఎక్కువ రోజులు ఉంటే వారికి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏదేమైనా మరో ఎనిమిది నెలలపాటు సునీత విలియమస్, విల్మోర్ లు స్పేస్ లోనే ఉండకతప్పని పరిస్థితి అని నాసా పరోక్షంగా పేర్కొంది.