Gautam Gambhir

భారత క్రికెట్ జట్టు కోచ్ గా గౌతమ్ రాణిస్తాడా?

టీం ఇండియా కొత్త కోచ్ గౌతమ్ ముందున్న సవాళ్లేంటీ?

స్పోర్ట్స్ రిపోర్ట్- టీంఇండియా కోచ్ గా గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) ఎంపికయ్యాడు. దీంతో గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ జట్టును ఎలా లీడ్ చేయబోతున్నాడంటూ అప్పుడే చర్చ మొదలైంది. గౌతమ్ గంభీర్ కు భారత క్రికెట్ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానముందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. 2007, 2011 ప్రపంచ కప్‌ విజయాల్లో గౌతమ్ గంభీర్ ది కీలకపాత్ర. ఆ తరువాత రిటైరై కోచ్‌గా అవతారం ఎత్తి, దూకుడైన కోచ్‌గా తనకుంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. గౌతమ్ దూకుడే ఈ సంవత్సరం ఐపీఎల్‌లో కోల్‌కతా జట్టుకు ట్రోఫీని సాధించిపెట్టింజి. ఈ సక్సెస్ గౌతమ్ గంభీర్ కు ఓ గొప్ప ఆఫర్‌ ఇచ్చిందని చెప్పాలి. అదే ది గ్రేట్ టీమ్‌ ఇండియా (Team India) కోచ్‌ పదవి.

టీం ఇండియా కోచ్రా గా హుల్‌ ద్రవిడ్‌ పదవి కాలం టీ20 ప్రపంచ  కప్‌తోనే ముగియడంతో బీసీసీఐ కొత్త కోచ్‌ గా గౌతమ్ గంభీర్ ను ఎంపిక చేసింది. మరి భారత క్రికెట్ జట్టు కోచ్ గా గౌతమ్ ఎలా రాణిస్తాడన్నదే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపతోంది. టీ20 లకు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, అజయ్ జడేజా గుడ్‌ బై చెప్పడంతో టీమ్ ఇండియాలో వారు లేని లోటును భర్తీ చేయడం గౌతమ్ ముందున్న అతి పెద్ద సవాల్‌ అని చెప్పాలి. సమర్థులైన యువ ఆటగాళ్లు చాలామందే ఉన్నా, మూడు ఫార్మాట్ల లోనూ ఆడే ఆటగాళ్లను గుర్తించి ప్రోత్సహించడమే అత్యంత కీలకమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 


Comment As:

Comment (0)