సెప్టెంబరు 18 నుంచి 26 వకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుమల రిపోర్ట్- కలియుగ ప్రత్యక్ష్య దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ముందు రోజు చేపట్టే అంకురార్పణ ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా నిర్వహించింది తిరుమల తిరుపతి దేవస్థానం (TTD). శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుని పర్యవేక్షణలో అంకురార్పణ కార్యక్రమం భక్తిశ్రద్దలతో నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారి తరఫున విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీవారి ఆలయానికి నైరుతి దిశలో భూదేవిని పూజించి, మృత్తికను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు.
ఈ ఘట్టాన్ని మృత్సంగ్రహణ యాత్ర (పుట్టమన్ను సేకరణ) అంటారని పండితులు చెప్పారు. ఈ మట్టిలో నవ ధాన్యాలను ఆరోహింపజేసే కార్యక్రమాన్ని అంకురార్పణగా పేర్కొంటారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో సెప్టెంబరు 18 నుంచి 26 వకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు (Tirumala Salakatla Brahmotsavam 2023) జరగనున్నాయి. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.