విభిన్న గెటప్ తో విక్రమ్ మరో ప్రయోగం
చియా విక్రమ్ తంగలాన్ ట్రైలర్ వచ్చేసింది..
మూవీ రిపోర్ట్- చియా విక్రమ్ (Vikram) హీరోగా రూపొందించిన సినిమా తంగలాన్ (Thangalaan). పా-రంజిత్ దర్శకుడు. ప్రముఖ హీరోయిన్ మాళవికా మోహనన్ కధానాయిక. తంగలాన్ ప్రచారంలో భాగంగా సినిమా యూనిట్ బుధవారం ట్రైలర్ ని విడుదల చేసింది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీయఫ్) లో పనిచేసే కార్మికుల జీవితాల చుట్టూ జరిగే వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పలు ప్రయోగాత్మక లుక్స్ తో అభిమానులను అలరించిన చియా విక్రమ్ ఈ సినిమాలో విభిన్న గెటప్ తో ఆకట్టుకోనున్నారని తెలుస్తోంది. తంగలాన్ మూవీ ట్రైలర్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.