News Pillar
Provides Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

“అల వైకుంఠపురంలో” ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “అల వైకుంఠపురములో”. అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరక్కుతున్న మూడవ చిత్రం కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.అయితే ఈ చిత్రానికి సంబంధించి తాజాగా “సామజవరగమన” అనే ఫస్ట్ సింగిల్ ను చిత్ర యూనిట్ విడుదల చెయ్యగా ఈ పాట యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది.

ఇంతకు మునుపు ఏ లిరికల్ వీడియో సాంగ్ కు రానంత ఆదరణ ఈ పాటకు వస్తుంది.విడుదలైన కొన్ని నిమిషాల్లోనే అత్యధిక లైక్స్ సంపాదించుకున్న లిరికల్ సాంగ్ గా సరికొత్త రికార్డును సృష్టించగా ఇప్పుడు అత్యధిక లైక్స్ సంపాదించుకున్న పాటగా మారిపోతుంది.ఈ లైక్స్ మరియు వ్యూస్ విషయంలో మాత్రం ఈ పాట ఎక్కడ తగ్గడం లేదు.

- Advertisement -

థమన్ నీట్ మ్యూజిక్ బీట్స్ సిద్ శ్రీరామ్ వాయిస్ లోని మ్యాజిక్ ఈ పాట వచ్చి రెండు రోజులు పూర్తయినా సరే యూట్యూబ్ లో నెంబర్ 1 ట్రెండింగ్ లోనే కొనసాగుతుంది.ఇదొక్కటే కాకుండా ఏకంగా అతి కొద్ది సమయంలోనే నాలుగు లక్షల లైక్స్ సంపాదించుకున్న లిరికల్ సాంగ్ గా మరో సరికొత్త రికార్డును నెలకొల్పింది.మొత్తానికి ఈ పాట మాత్రం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదని చెప్పాలి.ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Tags: ala vaikunthapurramulo youtube record, ala vaikunthapurramulo teaser, review, rating

Leave A Reply

Your email address will not be published.