పీఎన్‌బీ స్కామ్ ఆర్బీఐ వైఫ‌ల్య‌మేనా ..?

news02 Feb. 20, 2018, 12:22 p.m. business

Nirav_Modi_Hot_Comments_On_Panjab_Natinal_Bank

డిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో దర్యాప్తు మరింత స్పీడందుకుంది. తాజాగా ముంబై బ్రాడీహౌస్ బ్రాంచ్ కు చెందిన మరో ముగ్గురు అధికారులను సీబీఐ అరెస్ట్ చేసింది. చీఫ్ మేనేజర్ బిచ్చు తివారీ, స్కేల్ టూ మేనేజర్ యశ్వంత్ జోషి, ప్రఫుల్ సావంత్‌ ఉన్నారు. ముగ్గురూ రిటైర్డ్ డిప్యూటీ మేనేజర్ గోకుల్‌నాథ్ శెట్టి ఆదేశాలను అమలు చేసినట్టు తెలుస్తోంది. బ్యాంక్ బ్రాంచ్ ను సీల్ చేసి తమ అధీనంలోకి తెచ్చుకున్న సీబీఐ. నీరవ్ మోడీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ విపుల్ అంబానీని కూడా ప్రశ్నిస్తోంది. 

ఇటు దేశ చరిత్రలో అతిపెద్ద బ్యాంకింగ్ స్కాంకు తెర తీసిన డైమండ్ ఆభరణాల వ్యాపారి నీరవ్ మోడీ .. మొత్తం తప్పంతా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. పీఎన్‌బీ అత్యుత్సాహం వల్లే తనకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆరోపించాడు. తన సంస్థలు అమ్మి బకాయిలు చెల్లించగలనని చెప్పినా.. అన్ని అవకాశాలూ మూసి వేసి బ్యాంక్ మేనేజ్ మెంట్ ప్రజల్లోకి వెళ్లిందని ఆరోపించారు.  

ఫిబ్రవరి 15, 16 తేదీల్లో నీరవ్ మోడీ పీఎన్‌బీ మేనేజ్ మెంట్ కు రాసిన లేఖ కాపీ తాజాగా బయటపడింది.  ఇందులో తన కంపెనీలు బకాయిపడ్డ 5 వేల కోట్ల కంటే తక్కువ మొత్తాన్ని తిరిగి చెల్లించే స్తోమత ఉందని నీరవ్ రాశాడు. మీడియా తన గురించి తప్పుగా ప్రచారం చేయడంతో వెంటనే తనిఖీలు, స్వాధీనం జరిగాయని.. దీంతో ఫైర్ స్టార్ సంస్థలను అమ్మి బ్యాంకుల బకాయిలు తీర్చాలనుకున్నా.. వీలు కాలేదని  చేయలేకపోయానని చెప్పాడు. 

తక్షణం నా బకాయిలు రికవరీ చేసుకోవాలనే అత్యుత్సాహంతో తను వాటిని క్లియర్ చేస్తానని చెప్పినా పీఎన్‌బీ పట్టించుకోకుండా ప్రవర్తించిందని నీరవ్ తన లేఖలో తెలిపాడు. బ్యాంక్ చర్యల వల్ల తన బ్రాండ్‌ ఇమేజ్‌, వ్యాపారం నాశనమైందని. బ్యాంకుకు రుణాలు చెల్లించే తాహతు ఉన్నా అలా చేయలేని పరిస్థితిలో పడిపోయానని చెప్పాడు. ఫిబ్రవరి 13, 15న తనకు, బ్యాంక్ అధికారులకు, తన ప్రతినిధులకు మధ్య  సంప్రదింపులను కూడా ఇందులో రెఫర్ చేశాడు.  పీఎన్‌బీ పై నీరవ్ రాసిన లేఖ బయటపడడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తే .. ఈ స్కాం రిజర్వ్ బ్యాంక్ వైఫల్యంగా చెబుతూ కేంద్రం లేఖ రాయడం కూడా దేశమంతా కలకలం రేపుతోంది.

Related Post