న్యూఢిల్లీ: ప్రపంచ మొబైల్ రంగంలో మరో అద్భుతం ఆవిషృతం అయింది. చాలా మంది ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 5జీ మొబైల్ మార్కెట్లోకి వచ్చేసింది. వెరిజోన్ సహకారంతో మోటోరోలా సంస్థ తొలిసారి ఈ 5జీ మొబైల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మోటోజెడ్-3 పేరుతో 33,000 వేల ధరతో ఈ స్మార్ట్ ఫోన్‌ను మోటోరోలా సంస్థ విడుదల చేసింది. ఈ మొబైల్ ఈనెల 16 నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.
మోటోరోలా విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. 2160*1080 రిజల్యూషన్‌తో కూడిన 6 అంగుళాల సూపర్ అమో ఎల్ఈడీ టచ్ స్క్రీన్ అబ్బురపరుస్తోంది. మొబైల్ వేగంగా పని చేసేందుకు 4జీ ర్యామ్, డేటా స్టోరేజికి 64 జీబీ ర్యామ్, మైక్రో ఎస్డీ కార్డ్, 12-మెగాపిక్సల్ రెండు కెమెరాలు, ఫ్రింగర్ పింట్ సెన్సార్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో వంటి ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.
ఇక ఈ మొబైల్ ఈ నెల 16 వ తేదీ నుంచి మార్కెట్లోకి వస్తున్నప్పటికీ... 5జీ సేవలు మాత్రం వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఎందుకంటే మోటోరోలా భాగస్వామ్యం సంస్థ వెరిజోన్... ఈ మొబైల్‌కు సంబంధించిన 5జీ నెట్‌వర్క్‌ను సిద్ధం చేసే పనిలో ఉందంటా..! అది ఈ ఏడాది చివరి నాటికి పూర్తి అయ్యే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 5జీ నెట్వర్క్ అప్‌గ్రేడ్ కాగానే మోటోజెడ్-3కి మోడెమ్‌ను అమర్చుతారు. అప్పటి నుంచి 5జీ సేవలను ఈ స్మార్ట్ ఫోన్లో అందుబాటులోకి వస్తాయి. ఇక అప్పటి వరకు మాత్రం 4జీ, ఎల్టీఈ, 3జీ సేవలకు ఈ మొబైల్ సపోర్టు చేయనుంది.