తమకో ఉద్యోగి కావాలంటున్న వాట్సాప్

news02 April 12, 2018, 6:25 a.m. business

whats app job offer

న్యూయార్క్ (ఇంటర్నేషనల్ డెస్క్)-  వాట్సాప్.. ఇప్పుడు ప్రపంచంలో దీని గురించి తెలియనివారు దాదాపు ఉండరు. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరికీ వాట్సాప్‌ సుపరిచితమే. సోషల్ మీడియాలో వాట్సాప్ పెను సంచలనం అని చెప్పవచ్చు. సందేశాలు, ఫొటోలు, వీడియోలు ఇలా ఏది పంచుకోవాలనుకున్నా టక్కున గుర్తొచ్చేది వాట్సాప్. ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపును తెచ్చుకున్న వాట్సాప్‌ తన కార్యకలాపాలను భారతదేశంలో మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మన దేశంలో కంపెనీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారి కావాలంటూ ప్రకకన జారీ చేసింది వాట్సాప్.

ఇందులో భాగంగా ముంబయిలోని బృందంతో కలిసి పనిచేస్తూ అమెరికాలోని వాట్సాప్‌ చీఫ్‌ కు రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుందని పెర్కొంది. ఈ రంగంలో 15ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో పాటు, పేమెంట్‌ టెక్నాలజీపై పూర్తి పట్టు ఉండాలని స్పష్టం చేసింది. భారత్‌ లో వాట్సాప్‌ కు భారీ మార్కెట్‌ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మన దేశంలో 200 మిలియన్ల యాక్టివ్‌ యూజర్లు ఉన్నట్లు ఫిబ్రవరి గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో యూపీఐ ఆధారంగా వాట్సాప్‌ చెల్లింపులను మరింత మందికి చేరువ చేయాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇండియా హెడ్‌ నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించింది వాట్సాప్.

Related Post