లండన్ కోర్టు కీలక తీర్పు

news02 Dec. 10, 2018, 8:13 p.m. business

vijay

లిక్కర్ టౌకూన్.. వేల కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత దారుడు విజయ్ మాల్యాను భారత్ కు అప్పగించాలని లండన్ లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టు స్పష్టం చేసింది. తొమ్మిది వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేయడం, మనీలాండరింగ్‌కు పాల్పడటం వంటి ఆరోపణలతో ప్రస్తుతం ఆయనపై సీబీఐ, ఈడీ దర్యాప్తు జరుపుతోంది. ఐతే విజయ్ మాల్యా ఈ దర్యాప్తును తప్పించుకునేందుకు 2016 మార్చిలో రహస్యంగా లండన్ వెళ్ళిపోయారు. దీంతో విజయ్ మాల్యాను భారతదేశానికి అప్పగించాలని భారత ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. 

vijay

ఇక భారత ప్రభుత్వ అభ్యర్థనపై లండన్ లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టు 2017 డిసెంబరు 4 నుంచి విచారణ జరుపుతోంది. క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ దర్యాప్తు చేసి ఈ నివేధికను కోర్టుకు సమర్పించింది. మానవ హక్కులకు సంబంధించిన కారణాలను చూపుతూ మాల్యాను భారతదేశానికి అప్పగించేందుకు ఎటువంటి అడ్డంకులు లేవని ఈ దర్యాప్తు నివేదిక స్పష్టం చేసింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ చతికిలబడటం అనివార్యమని మాల్యాకు ముందే తెలుసునని, బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించాలనే ఉద్దేశం ఆయనకు లేదని ఈ సందర్బంగా వెస్ట్ మినిస్టర్ కోర్టు వ్యాఖ్యానించింది.

tags: vijay, vijay malya, vijay malya coming to india, london court on vijay malya, west minister court about vijay malya

Related Post