Gudlavalleru college

ఘటనపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం

ఇంజినీరింగ్ కళాశాలలో సీక్రెట్‌ కెమెరాల కలకలం

ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కళాశాలలో (gudlavalleru engineering college) సీక్రెట్‌ కెమెరాల వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణల అంశంపై సీఎం విచారణకు ఆదేశించారు. తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇంజినీరింగ్ కళాశాలలోని హాస్టల్‌ లో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయని విద్యార్థినుల ఆందోళనపై సమగ్ర విచారణ జరపి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు స్పష్టం చేశారు.  ఈ మేరకు తెలుగుదేశం పార్టీ తన అధికారిక ట్విట్టర్-ఎక్స్‌ పోస్టు చేసింది.

గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్‌ కళాశాలలో రహస్య కెమెరాల అంశం నిన్నటి నుంచి కలకలం రేపుతోంది. గురువారం అర్ధరాత్రి దాటాక కళాశాలలో విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. బాలికల హాస్టల్‌ వాష్‌రూమ్‌ లో రహస్య కెమెరాలు పెట్టారని వారు ఆరోపించారు. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల వరకు వీరి ఆందోళన కొనసాగింది. సీక్రెట్ కెమెరాతో తీసిన వీడియోలు విక్రయిస్తున్నాడంటూ విధ్యార్ధులు అదే కళాశాలలో చదువుతునవ్న బీటెక్‌ విద్యార్థిపై దాడికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు కళాశాల హాస్టల్‌ కు చేరుకుని విద్యార్థులను అదుపు చేశారు. 

సీక్రెట్ కెమెరాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థి విజయ్‌ని పోలీసులు ప్రశ్నించారు. అతడి ల్యాప్‌ ట్యాప్‌ తో పాటు సెల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకుని విచారణ మొదలుపెట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు ఆదేశాలతో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ గంగాధర్‌రావు కళాశాల హాస్టల్ కు వెళ్లి.. విద్యార్థినులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై మంత్రి లోకేశ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
 


Comment As:

Comment (0)