నిన్ను నమ్మి ప్రేమిస్తే...

news02 June 26, 2018, 9:03 a.m. entertainment

teju i love u

సినిమా పిల్లర్- అమ్మాయిల్ని పడేయటం అంత ఈజీనా.. అదేనండి ప్రేమలో పడేయటం అంత సులువా... అంటే అవుననే అంటున్నాడు సాయిధరమ్ తేజ్. రీసెంట్ గా సాయి నటించిన తేజ్ ఐలవ్ యు టీజర్ అందరిని ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ లో హీరో సాయిధరమ్ తేజ్.. హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ డైలాగ్స్ మాత్రమే ఉన్నాయి. అమ్మాయిల్ని పడేయటం చాలా ఈజీ.. ఓ మూడు రోజులు ఆ అమ్మాయి చుట్టూ తిరుగు.. మూడు రోజులు అమ్మాయినే చూస్తూ ఉండు.. నాలుగో రోజు కూడా తిరుగు. ఆ అమ్మాయి చూసినా నువ్వు చూడొద్దు.. అప్పుడు డిస్ట్రబ్‌ అవుద్ది చూడూ.. అని సాయిధరమ్ తేజ్ డైలాగ్ విన్పిస్తుంది.

anupama

ఇక అందాల భామ అనుపమా పరమేశ్వరన్ అయితే.. నేను ప్రేమించడానికి ఇంత మోసం చేస్తావా.. అసలు ఇదంతా నిజమని నమ్మి, నేను నిన్ను ప్రేమిస్తే.. అలాంటి ప్రేమను ఏం చేస్తావ్‌.. అని కాస్త హస్కీ వాయిస్ లో చెప్పింది. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ కరుణాకరణ్ ఈ సినిమాకు దర్శకకత్వం వహంచాడు. 

tags: teju ilove u, teju i love you, teju i love you trailer, telu ilove you teaser, teju ilove you movie, anupama parameshwaran

Related Post