స్టార్ కూతురు అభిమానం..

news02 Aug. 7, 2018, 10:31 a.m. entertainment

mahesh rushi

సినిమా పిల్లర్- ప్రిన్స్ మహేశ్ బాబుకు చాలా మంది అభిమానులుంటారు.. అందులో ఆశ్చర్యమేమి లేదనుకొండి. మరి అదే మహేశ్ బాబు కూతురు సితారకు ఇష్టమైన నటుడెవరంటే.. మీరు చెప్పగలరా.. కనీసం ఉహించగలరా.. మీరనుకుంటున్నట్లు ఏ చిరంజీవో.. బాలకృష్ణనో.. కాదు. హాస్య నటుడు వెన్నెల కిషోర్ అంటే సితారకు ఇష్టమట. మీరు విన్నది నిజమేనండి.

sitara

మహేశ్ బాబు కూతురు సితారకు హస్య నటుడు వెన్నెల కిషోర్ అంటే చాలా ఇష్టమట. అందుకే మహేశ్ బాబు సినిమా వంశీ పైజిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న రిషి సినిమా షూటింగ్ కు వెళ్లి మరీ వెన్నెల కిషోర్ ను కలిసింది సితార. అన్నపూర్ణ స్టుడియో లో జరుగుతున్న సినిమా షూటింగ్ లో వెన్నెల కిషోర్ ను కలిసిన సితార తన తండ్రితో పాటు ఫోటో సైతం దిగింది. ఈ ఫోటోనే హీరో మహేష్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

sitara namrata

ఇక తన కూతురు సితారకు వెన్నెల కిషోర్ అంటే చాలా ఇష్టమని.. ఆయన నటనను లైక్ చేస్తుందని మహేష్ బాబు చెప్పారు. అందుకే తన షూటింగ్ లో ఉన్న వెన్నెవ కిషోర్ ను చూపించడానికే అన్నపూర్ణ స్టుడియోకు సితారను తీసుకొచ్చానని చెప్పారాయన.

tags: sitara, sitara favourite actore, sitara vennela kishore, sitara mahesh, sitara mahesh babu, mahesh rushi, mahesh babu rushi, mahesh namrata

Related Post