సవ్యసాచి సినిమా రివ్యూ

news02 Nov. 2, 2018, 8:01 p.m. entertainment

savyasachi

అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమా రివ్యూ మీకోసం..

సినిమా- స‌వ్య‌సాచి 
తారాగణం- అక్కినేని నాగ‌చైత‌న్య‌, నిధి అగ‌ర్వాల్, మాధ‌వ‌న్, భూమిక, వెన్నెల కిషోర్, స‌త్య, రావు ర‌మేశ్.. తదితరులు.
మ్యూజిక్- ఎం.ఎం.కీర‌వాణి
ఫైట్స్- రామ్‌ల‌క్ష్మ‌ణ్‌
నిర్మాత‌లు- న‌వీన్ యేర్నేని, ర‌విశంక‌ర్.వై, మోహ‌న్ చెరుకూరి
ద‌ర్శ‌క‌త్వం- చ‌ందూ మొండేటి. 

న్యూస్ పిల్లర్ రేటింగ్- 1.5/5

పరిచయం....
అక్కినేని నాగచైతన్య గురించి కొత్తగా చెప్పేదేం లేదు. ఎందుకంటే నాగచైతన్య ప్రేమ కధల నుంచి మొదలు ఫ్యాక్షన్ కధల వరకు అన్నింటిలోను ఇట్టే ఒదిగిపోతాడు. ఏంమాయ చేశావే సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న నాగచైతన్య అక్కడి నుంచి వెనక్కు తిరిగి చూసుకోలేదు. ఇక కార్తికేయ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు చందు మొండేటి ఈ సారి నాగచైతన్య హీరోగా సవ్యసాచితో మన ముందుకు వచ్చాడు. అంతా కాదు మరో హీరో మాధవన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడంతో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. మరి ఇంతకీ సవ్యసాచి సినిమా కధేంటీ.. ఎలా ఉందో తెలుసుకుందామా...

savyasachi

సవ్యసాచి కధ...
విక్ర‌మ్ ఆదిత్య (నాగ‌చైత‌న్య‌)  టీవీ యాడ్స్ తీసే ఓ డైరెక్టర్. ఈ క్రమంలోనే  కాలేజీలో చిత్ర (నిధి అగర్వాల్‌)ని చూసి ప్రేమిస్తాడు. ఒక‌రికొకరు ద‌గ్గ‌ర‌య్యే క్ర‌మంలోనే అనుకోని పరిస్థితుల్లో ఇద్దరు దూర‌మ‌వుతారు. ఆరేళ్ల త‌ర్వాత అనుకోకుండా మ‌ళ్లీ విక్రమ్, చిత్ర క‌లుసుకుంటారు. ఐతే విక్ర‌మ్ ఆదిత్య వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్‌ అనే విచిత్రమైన వ్యాధితో పుట్టిన వ్య‌క్తి. అంటే అత‌నిలో మ‌రో మ‌నిషి కూడా ఉంటాడన్న మాట. భావోద్వేగానికి గురైనా, ఎక్కువ సంతోషం క‌లిగినా ఎడ‌మ చేతి వైపున ఉంటూ రేస్పాండ్ అవుతుంటాడు అతనిలోని ఆ రెండో వ్యక్తి. ఒక‌రిలో ఇద్ద‌రున్నారు కాబ‌ట్టే త‌ల్లి ఒకరి పేరు విక్ర‌మ్‌గా, మ‌రొక‌రి పేరు ఆదిత్య‌గా పిలుచుకుంటుంది. ఇదంతా పక్కనపెడితే.. తాను ప్రేమించిన చిత్రకు మ‌ళ్లీ ద‌గ్గ‌రై ఆనందంగా గ‌డుపుతున్న స‌మ‌యంలోనే విక్ర‌మ్ ఆదిత్య అక్క శ్రీదేవి (భూమిక‌) ఇంట్లో హాఠాత్తుగా బాంబు బ్లాస్ట్ అవుతుంది. ఈ ఘటనలో విక్రమ్ బావ చ‌నిపోగా, త‌న‌కి ఎంతో ఇష్ట‌మైన అక్క కూతురు మ‌హాల‌క్ష్మి కిడ్నాప్‌కి గుర‌వుతుంది. ఇంత‌కీ ఆ బాంబు పేల్చింది ఎవరు.. కిడ్నాప్ అయిన విక్రమ్ మరదలు మహాలక్ష్మి ని ఎలా కాపాడతాడు..ఈ క్రమంలో అతనిలోనే ఉన్న ఎడమచేతి వ్యక్తి విక్రమ్ కు ఎలా సాయం చేశాడు.. కధలో మాధవన్ పాత్ర ఎంటీ.. ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే మాత్రం సవ్యసాచి చూడాల్సిందే...


సవ్యసాచి ఎలా ఉందో తెలుసా...
సవ్యసాచి కధంతా ఆసక్తికరంగా సాగుతుంది. అసలు వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అంటే ఎంటీ.. ఈ వ్యాధి ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయి, దాంతో త‌లెత్తే స‌మ‌స్య‌ల్ని వివరిస్తూనే సినిమా కధ ప్రారంభమవుతుంది. అయితే కధలోని ఎత్తుగడలో ఉన్నంత ఆస‌క్తి .. క్రమ క్రమంగా తగ్గిపోవడమే ఈ సినిమాకు మైనస్ గా చెప్పుకోవచ్చు. సినిమా మొత్తంలో ఒకే వ్యక్తిలో ఇద్ద‌రున్నార‌నే విష‌యాన్ని చెప్పడం తప్ప.. మొదటి భాగంలో పెద్దగా కధ ఏంలేదనే చెప్పాలి. కధలోని పాత్రలన్నింటినీ ప‌రిచ‌యం చేయడం తప్ప.. కధ చెప్పిందేం లేదని చెప్పవచ్చు.  కాలేజ్ నేప‌థ్యంలో వ‌చ్చే కధలోనూ విక్ర‌మ్.. చిత్ర‌ల మ‌ధ్య ప్రేమ‌క‌థ‌లోనూ కొత్త‌ద‌నం ఏమీ లేదని చెప్పకతప్పడం లేదు. హీరో.. హీరోయి్ల మధ్య ప్రేమ చిగురించే సీన్స్ కూడా చప్పగా సాగాయి. నాగ‌చైత‌న్య‌, వెన్నెల‌కిషోర్‌, స‌త్య త‌దిత‌రులు చేసిన కామెడీ కొంత మేర పరవాలేదనిపించింది. 

savyasachi

ఇక ఇంటర్వేల్ తరువాత సినిమా అస‌లు క‌థలోకి వెళుతుంది. విక్రమ్ అక్క భూమిక ఇంట్లో బాంబు పేలుడు సంఘ‌ట‌న‌, అక్క కూతురు కిడ్నాప్ విష‌యం వెలుగులోకి వ‌చ్చాక దాని వెన‌క కార‌ణాల్ని వెతికే పనిలో పడతాడు హీరో. ఇక్కడి నుంచి కాస్త మైండ్ గేమ్ త‌ర‌హా క‌థ‌నం ప్రారంభమవుతుంది. కానీ ఈ మైండ్ గేమ్‌లోను కొత్త‌ద‌నం కానీ, ఆస‌క్తిక‌ర‌మైన అంశాలేవీ లేక‌పోవ‌డంతో స‌న్నివేశాలన్నీ ఉస్సూరుమనిపించాయి. కాకపోతే క్లైమాక్స్‌కి ముందు వ‌చ్చే కొన్ని స‌న్నివేశాలు మాత్రం పరవాలేదనిపిస్తాయి. హీరో విక్ర‌మ్ ఆదిత్య కుటుంబాన్ని టార్గెట్ చేయ‌డం వెన‌క అసలు కార‌ణాలు, అరుణ్ పాత్ర‌లో మాధ‌వ‌న్ తో కూడిన స‌న్నివేశాలు కొంత మేర ఆకట్టుకుంటాయి. కధను చెప్పడం.. దాన్ని రసవత్తరంగా చూపించడంలో లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి.

అంతా ఎలా చేశారో తెలుసా..
అక్కినేని నాగ‌చైత‌న్య‌, మాధ‌వ‌న్‌ల నటన బావుంది. హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ పరవాలేదనిపించి. తన అందచందాలతో ఆకట్టుకుంది. భూమిక చాలా చిన్న పాత్ర‌లో క‌నిపించడంతో పెద్దగా ప్రాధాన్యం లేదని చెప్పవచ్చు. వెన్నెల కిషోర్‌, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్, సుద‌ర్శ‌న్ పాత్ర‌లు సినిమాలో కాస్తైనా కామెడీ చేశామనిపించాయి. ఇక తాగుబోతు ర‌మేష్ పాత్ర కాస్త వెరైటీగానే ఉంజి. ఐతే సాంకేతికంగా సవ్యసాచి బాగా ఉందని చెప్పుకోవాలి. కధలో కొత్త పాయింట్ ఉన్నా.. కధను చెప్పడంలో.. తెరపై చూపించడంలో మాత్రం దర్శకుడు తడబడ్డాడని చెప్పవచ్చు. 

నోట్.. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం.

 

tags: savyasachi, savyasachi review, savyasachi movie review, savyasachi film, savyasachi film review, savyasachi rating, savyasachi exclusive review, savyasachi moview

Related Post