పడుచు పెళ్లాంతో హవాయిలో

news02 May 19, 2018, 8:31 a.m. entertainment

milind

సినిమా పిల్లర్- ప్రముఖ మోడల్.. బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ లేటు వయసులో 27 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకొని ఔరా అనిపించారు. అంతే కాదు ఈ కొత్త జంట హనీమూన్ కోసం హవాయి దీవులకు వెళ్లారు. అసోం కు చెందిన 27 ఏళ్ల అంకిత కొన్వార్ తో రెండేళ్లుగా డేటింగ్ చేసిన మిలింద్ సోమన్ ఆమెను తాజాగా అస్సామీ, మహారాష్ట్ర సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. 

soman

ఇంకేముంది పెళ్లి తరువాత తన పడచు పెళ్లాం అంకితతో కలిసి హవాయి దీవుల్లో హనీమూన్ కోసం వెళ్లాడు. హవాయి బీచ్ లో భార్యతో దిగిన ఫోటోలను మిలంద్ సోమన్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. సోమన్ అగ్ని పర్వతంపై భార్యతో కలిసి ఆరుగంటల పాటు వాకింగ్ చేసిన ఫోటోతో తమ మధ్య ప్రేమ బంధం మరింత బలపడింది చెప్పుకొచ్చాడు. తమ మధ్య ప్రేమకు వయసు అంతరం కాదని సోమన్ భార్య అంకిత చెప్పింది. 

ankita

ఇక గతంలో ఫెమీనా మిస్ ఇండియా.. మోడల్ మధుస ప్రేతో కొన్నాళ్లు కలిసి సహజీవనం చేసిన మిలంద్ ఆమెతో తెగతెంపులు చేసుకున్నాడు. ఆతరువాత ప్రెంచ్ నటి మైలేనీ జంపానీని 2006లో గోవాలో పెళ్లాడిన మిలింద్ సోమన్ విబేధాలతో 2009లో విడాకులు తీసుకున్నాడు. కొన్నాళ్లు దీపాన్నిత అనే మోడల్, బాలీవుడ్ నటి  సహానా గోస్వామిలతో సహజీవనం చేసిన మిలింద్ వారికి కూడ దూరమయ్యారు. 

ankita hot

ఇదిగో ఇప్పుడు మళ్లీ అసోంకు చెందిన 27 అంకితతో 53 ఏళ్ల మిలింద్ రెండేళ్లు డేటింగ్ చేసి పెళ్లిచేసుకున్నాడు. వయసు అంతరం ఉన్నా తమ హనీమూన్ హవాయి దీవుల్లో హాయి హాయిగా సాగుతుందని మిలింద్ సోమాని, అంకిత దంపతులు ఆనందంగా చెబుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ పడుచు పెళ్లాంతో మిలింద్ ఎన్నాళ్లు కాపురం చేస్తాడో అన్నదే ఇప్పుడు బాలీవుడ్ లో చర్చ.

 

tags: milind, milind ankita, milind soman, soman honeymoon

Related Post