పందెంకోడి2 సినిమా రివ్యూ

news02 Oct. 18, 2018, 9:58 p.m. entertainment

pandem kodi2

సినిమా- పందెం కోడి2 
తారాగణం-విశాల్‌, కీర్తి సురేష్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, రాజ్‌ కిరణ్‌, ఆర్జేయ్‌, రామ్‌ దాస్‌ తదితరులు
మ్యూజిక్- యువన్‌ శంకర్‌ రాజా
నిర్మాతలు- విశాల్‌, ధవల్‌, అక్షయ్‌
దర్శకత్వం- ఎన్‌.లింగుస్వామి
న్యూస్ పిల్లర్ రేటింగ్- 2/5

పరిచయం....
తమిళ నటుడు విశాల్ తెలుసు కదా.. ఈ హీరో నటించే ప్రతి తమిళ సినిమా తెలుగులోను విడుదలవుతుంది. విశాల్ గత సినిమాలు పందెంకోడి, డిటెక్టివ్, అభిమన్యుడు వంటి సినిమాలు అటు తమిళంలోను ఇటు తెలుగులోను మంచి సక్సెస్ సాధించాయి. ఇక విశాల్ పందెంకోడి సినిమా భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్ గానే ఇప్పుడు పందెంకోడి2 ను మన ముందుకు తీసుకువచ్చారు విశాల్. మరి పందెంకోడి2 సినిమా ఎలా ఉందో చూసేద్దామా..

keerthi

పందెంకోడి2 కధ...
గత పందెంకోడి సినిమాలాగే.. పందెంకోడి2 కధ కూడా రాయలసీమ నేపధ్యంలోనే ఉంటుంది. రాజారెడ్డి (రాజ్ కిరణ్) చుట్టుపక్కల ఏడు ఉర్లకు పెద్దమనిషి. ప్రతి సంవత్సరం ఈ ఏడు గ్రామాలవారు కలిసి ఎంతో ఘనంగా జాతర జరుపుకుంటుంటారు. ఐతే ఈ క్రమంలో ఓ యేడు జాతరలో అనుకోకుండా రెండు కుటుంబాలకు గొడవ జరుగుతుంది. దీంతో చాలా కాలం ఈ ఏడు ఉర్లల్లో జాతర జరక్కుండా ఆగిపోతుంది. ఇలా జతర జరగకపోవడం వల్లే రాయల సీమకు కరువు వచ్చిందని.. వర్షాలు కురవడం లేదని అక్కడి ప్రాంత జనం భావిస్తారు. ఐతే అలాగని జాతర జరిపితే పెద్ద ఎత్తున రక్తపాతం జరుగుతుందన్న భయం వారిని పట్టిపీడిస్తుంది. 

ఈ క్రమంలోనే ఏడు సంవత్సరాల తరువాత ఎలాగైనా మళ్లీ జాతర జరిపించాలని రాజా రెడ్డి నిర్ణయిస్తారు. ఈ జాతర కోసమేనని రాజా రెడ్డి కొడుకు బాలు (విశాల్) విదేశాల నుంచి సొంత ఉరుకు వస్తాడు. మరోపక్క ఏడేళ్ల తరువాత జరుగుతున్న జాతరను భవానీ (వరలక్ష్మి శరత్ కుమార్) అడ్డుకోవాలని చూస్తుంది. దీంతో మళ్లీ ఇరు పక్షాల మధ్య గొడవ జరుగుతుంది. అసలు భవానీ జాతరను ఎందుకు అడ్డుకోవాలనుకుంటుంది.. జాతర కోసం బాలు ఏంచేస్తాడు.. చివరకు జాతర జరిగిందా.. లేదా అన్నదే అసలు కధ.

pandem kodi2
పందెంకోడి సినిమా సైతం విశాల్- దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్ లోనే వచ్చింది. ఇదిగో మళ్లీ 12 యేళ్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో పందెంకోడి కి సీక్వేల్ గా వచ్చిన పందెంకోడి2 సైతం భారీ యాక్షన్ సినిమా అని చెప్పవచ్చు. మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగానే మంచి ఫైట్లు ఉంటాయి ఈ సినిమాలో. ప్రతి పది నిమిషాలకో ఫైట్ పెట్టి మాస్ ను బాగా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు లింగుస్వామి. మొదటి భాగంలో మొత్తం యాక్షన్ సీట్లతోనే సినిమా ఆకట్టుకుంటుంది.

ఇక ఇంటర్వేల్ కు ముందు విశాల్, కీర్తీ సురేష్ ల మధ్య మొదలట్టే రొమాన్స్ సీన్స్ తో కాస్త యాక్షన్ సీన్స్ కు బ్రేక్ పడుతుంది. పందెంకోడి సినిమాలో మీరాజాస్మిన్ క్యారెక్టర్ లాగే.. పందెంకోడి2 లో కూడా కీర్తి సురేష్ క్యారెక్టర్ కూడా మాస్ స్టైల్లో కనిపిస్తుంది. కీర్తి సురేష్ సినిమాలో బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఐతే ఈ సినిమాలో స్క్రీన్ ప్లే పై మరింత శ్రద్ద పెట్టాల్సిందని అనిపిస్తోంది. ఇంటర్ వెల్ తరువాత వచ్చే చాలా సన్నీవేశాలు రక్కి కట్టించలేకపోయాయని ఇట్టే అర్దమైపోతుంది.
 
ఇక కీర్తి సురేష్ పాత్ర నిడివి కాస్త తక్కువగా ఉందని అనిపిస్తుంంది. మరో హీరోయిన్ వరలక్ష్మి పాత్రపై దర్శకుడు ప్రత్యేకంగా ఫోకస్ చేయడంతో సినిమాలోని ఇతర పాత్రలన్నీ సైడైపోయినట్లు కన్పిస్తుంది. లేడీ విలన్ గా నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ బాగా చేసిందని చెప్పవచ్చు. ఐతే సినిమా అంతా యాక్షన్ గోల, పగలు, ప్రతీకారాల చూట్టూ తిరగడంతో కొంత బోర్ అనిపిస్తుంది. అంతే కాదు కామెడీ పాళ్లు తగ్గడంతో మరీ పేలవంగా అనిపిస్తుంది సినిమా. అంతే కాదు సినిమా అంతా తమిళ నేటివిటీతో తీయడంతో కధ తెలుగు కు అంతగా సింక్ కాలేదని అనిపిస్తుంది. 

pandem kodi2

ఎలా చేశారంటే...
ఎప్పటిలాగే హీరో విశాల్ బాగా ఎనర్జిటిక్ గా నటించాడు. ఐతే విశాల్ నటనలో ఏ మాత్రం మార్పు లేదు. అంటే పందెంకోడి లో ఎలా నటించాడో.. అచ్చు అలాగే పందెంకోడి2 లోను కన్పించాడు. ఇక మహానటి సినిమా చూసిన వారు పందెంకోడి2 సినిమా చూస్తే మాత్రం కంగారు పడతారు. ఎందుకంటే కీర్తీ సురేష్ ఈ సినిమాలో ఉర మాస్ క్యారెక్టర్ లో నటించింది. మాహా నటి క్లాస్ కు.. ఈ సినిమా మాస్ కు ఏ మాత్రం పోలిక లేదు. ఇక విలన్ క్యారెక్టర్ చేసిన మరో హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ నటన బావుంది. మొత్తానికి పందెంకోడి2 సినిమా.. సినిమా కోసం కాకుండా.. ఏదో టైంపాస్ కాకపోతే వెళ్లీ చూడాలి తప్ప.. మరే అంచనాలు పెట్టుకుని మాత్రం సినిమా ధియోటర్ కు వెళ్లకూడదు.


నోట్- ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

tags: pandem kodi, pandem kodi2, pandem kodi2 review, pandem kodi2 movie review, pandem kodi film review, pandem kodi2 movie, pandem kodi2 rating, pandem kodi2 movie rating

Related Post