ఘన కీర్తిసాంధ్ర.. విజితాఖిలాంధ్ర

news02 Dec. 3, 2018, 6:49 a.m. entertainment

ntr

ఎన్టీఆర్- కథానాయకుడు సినిమా టైటిల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఘన కీర్తిసాంధ్ర.. విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్రా.. అంటూ సాగే ఈ పాట.. ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. మొత్తం 3 గంటల 30 నిమిషాల పాటు సాగిన ఈ పాట ఎన్టీఆర్ చిత్రాలను, గుణగణాలను కళ్లకు కట్టినట్టు వర్ణించింది. నందమూరి బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం ఎన్టీఆర్. తన తండ్రి జీవితకథను బయోపిక్‌గా తెరకెక్కిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి ఎన్టీఆర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రానా దగ్గుబాటి, విద్యాబాలన్, నిత్యామీనన్, రకుల్ ప్రీత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ మొదటి బాగం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల అవుతుంది.

ntr

tags: ntr, ntr bio pic, ntr bio pic title song,ntr biopic title song, ntr biopic , ntr kathanayakudu title song, kathanayakudud title song

Related Post