ధడక్ సినిమా ట్రైలర్..

news02 June 11, 2018, 4:32 p.m. entertainment

sridvei

సినిమా పిల్లర్- దివికేగిన దేవత శ్రీదేవి ఇప్పుడు బతికి ఉంటే ఈ రోజు ఎంత సంతోషించేదో. ఎందుకంటే తన కూతురు జాన్వి మొట్టమొదటి సారి నచింటిన ధడక్ సినిమా ట్రైలర్ విడుదలైంది. అంతా ట్రైలర్ లో జాన్వీ ఎంతో బాగా నటించిందని అంటున్నారు. ఇదే మాట శ్రీదేవి విని ఉంటే ఎంత పొంగిపోయేదో కదా. 

janhvi

శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి ‘దఢక్‌’ చిత్రంతో బాలీవుడ్‌ కి పరిచయం అవుతోంది. అతిలోక సుందరి కుమార్తే జాన్వి మొట్టమొదటి సినిమా కావడంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖుల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.అంతేకాదు మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘సైరాట్‌’కు ఇది రీమేక్‌ గా వస్తోంది. ఇక ఈసినిమాలో బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ తమ్ముడు ఇషాన్‌ ఖత్తర్‌ హీరోగా నటించాడు. ఇక ధడక్ సినిమా ట్రైలర్ లో ఫస్ట్‌లుక్‌ తోనే జాన్వి ప్రేక్షకుల హృదయాలను దోచుకుందని సినీవర్గాలంటున్నాయి.

dhadak

బాలీవుడ్ డైరెక్టర్ శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వం వహించిన ధడక్ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వికి అవకాశం ఇచ్చింది కూడా కరణ్‌ జోహారే. ఈ సినిమా షూటింగ్ సమయంలో  శ్రీదేవి రోజూ జాన్వితో కలిసి సెట్స్‌కు వెళుతుండేవారు. ఆ తరువాత శ్రీదేవి మరణంతో కరణ్ జోహరే దగ్గరుండి జాన్వి చేత సినిమా పూర్తి చేయించారు. 

sridevi

tags: dadhak, dhadak, dadhak trailor, sridevi, janhavi, janhavi dhadak, janhavi kapoor, dhadak movie, sridevi janhavi

Related Post