విహారయాత్రలో అక్కినేని ఫ్యామిలీ..

news02 Sept. 26, 2018, 7:46 p.m. entertainment

samantha

అక్కినేని కొత్త జంట జాలీగా హాలీడే ఎంజాయ్ చేస్తోంది. అక్కినేని నాగచైతన్య, సమంత సినిమాల గ్యాప్ లో సేద తీరుతున్నారు. వీరిద్దరుతో పాటు అక్కినేని అఖిల్ సైతం టూర్ కు వెళ్లారు. ఇంతకీ వీళ్లెక్కడికి వెళ్లారని అనుకుంటున్నారా.. మధ్యధరా సముద్రంలోని ప్రముఖ ద్వీపాల్లో ఒకటైన ఐబిజా ద్వీపానికి వెళ్లారు. ఇక్కడ ఏకాంతంగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అక్కినేని కుటుంబ సభ్యులు. 

samantha

ఇక వీరంతా ఎంజాయ్ చేస్తున్న సందర్బంగా తీసిని ఫోటోలను సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. అవి వైరల్ అవ్వడం జరిగిపోయింది. ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. అలాగే ఉండు.. నేను ఫోటో తీసుకోవాలని అంటూ తన భర్త నాగచైతన్య తన ఫోటోను తీశారని మురిసిపోతూ చెప్పింది సమంత. మరో ఫోటోలోనేమో అక్కినేని నాగచైతన్య, అఖిల్ కన్పించగా.. ఇంకో ఫోటోలో సమంత, నాగచైతన్య గాడంగా హత్తుకుని కన్పించారు. మొత్తానికి అక్కినేని నవతరం ఫ్యామిలీ జాలీగా ఎంజాయ్ చేస్తున్నారని వేరే చెప్పక్కర్లేదు.

 

tags: akkineni, samantha, akkineni samantha, akkineni family in vacation, samantha in holiday vacation, samantha nagachaitanya holiday vacation

Related Post