ధైర్య‌ముంటే ప్ర‌తి మ‌హిళా హీరోయినే

news02 June 2, 2018, 6:04 p.m. entertainment

hot anchor anasuya
హైద‌రాబాద్: రంగ‌స్థ‌లం తెచ్చిన పేరో...లేదా...రంగ‌మ్మ‌త్తగా పాపులైన పొగ‌రో తెలియ‌దు కానీ, హాట్ యాంక‌ర్ అన‌సూయ హీరోయిన్‌గా త‌న‌కేం త‌క్కువంటోంది. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో హీరోయిన్ క్యారెక్ట‌ర్ వేసేందుకు అన్ని ల‌క్ష‌ణాలున్నాయంటోంది. అంతేకాదు అస‌లు ధైర్య‌ముంటే ప్ర‌తి మ‌హిళా హీరోయినేన‌ని చెబుతోంది. 

anasuya

విశాఖపట్నంలో ఓషాపింగ్‌ మాల్‌ను ప్రారంభించిన అన‌సూయ ఈ కామెంట్ చేసింది. మీడియాతో మాట్లాడిన ఆమె... ప్రస్తుతం చేతిలో 5 సినిమాలు ఉన్న‌ట్లు చెప్పుకొచ్చింది. రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మ‌త్త‌గా న‌టించ‌డం ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని అనుభూతినిచ్చిందంది. రంగ‌త్త‌మ్మ‌లాంటి మ‌రిన్ని పాత్ర‌ల్లో న‌టించి మంచి గుర్తుంపు తెచ్చుకోవాల‌ని ఉందంది. 

anasuya

అయితే అన‌సూయ చేసిన కామెంట్స్ ఆస‌క్తిక‌రంగా మారిన‌ట్లు చెబుతున్నారు సినీ విశ్లేష‌కులు. ఆమెకు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించాల‌నే కోరిక మేర‌కే ఈ కామెంట్స్ చేసి ఉండొచ్చ‌ని అంటున్నారు. 

tags: hot anchor anasuya,jabardasth, rangastalam, telugu heroiene, anasuya heroine anasuya heroine photos anasuya movie heroine anasuya movie heroines

Related Post