ఎట్టకేలకు క్లారీటీ వచ్చేసింది..

news02 Jan. 17, 2019, 8:20 p.m. entertainment

vishal

హీరో విశాల్‌ పెళ్లిపై చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఓ సారి వరలక్ష్మి శరత్ కుమార్ ను పెళ్లి చేసుకుంటున్నాడని.. మరోసారి హైదరాబాద్ కు చెంది వ్యాపార వేత్త కూతురును పెళ్లి చేసుకుంటున్నాడనే చర్చ జోరుగా సాగింది. ఇదిగో ఇటువంటి వాటికన్నింటికి చెక్ పెడుతూ.. ఏకంగా విశాల్ ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయే క్లారిటీ ఇచ్చేసింది. తానే విశాల్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పేసింది. ఇంతకీ విశాల్ ను పెళ్లి చేసుకోబోయేది ఎవరని అనుకుంటున్నారా.. ఆమె మరెవరో కాదండీ అనీశా. 

anisha

హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె అయిన అనీశాతో వివాహం జరగనున్నట్లు విశాల్‌ తండ్రి, ప్రముఖ నిర్మాత జీకే రెడ్డి స్పష్టం చేశారు. పెళ్లిచూపులు సినిమాతో విజయ్‌ దేవరకొండకు ప్రేయసిగా నటించిన యువతే అనిశా. విజయ్‌ దేవరకొండ నటించిన అర్జున్‌రెడ్డి సినిమాలోను అనీశా నటించింది. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాననని.. తన ఎదుగుదలలో, ఆలోచనల్లో స్ఫూర్తిగా నిలిచినందుకు అందరికీ ధన్యవాదాలని.. తన జీవితంలో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి తనకు సరైన తోడు దొరికిందని చెబుతూ అనీశా ఇన్ స్టా గ్రామ్ లో విశాల్ తో దిగిన ఫోటో షేర్ చేసింది అనీశా.

tags: vishal, anisha, vishal marriage with anisha, hero vishal will marriage anisha, anisha marriage with vishal

Related Post