1984లో చంద్రబాబు నాయుడు..

news02 Sept. 13, 2018, 8:43 a.m. entertainment

ntr

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ.. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా ఎన్టీఆర్. ఆయన తనయుడు బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఎన్టీఆర్ సినిమాపై అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి. 

ntr

ఈ సినిమాలో కీలక పాత్రదారుడైన చంద్రబాబు నాయుడు పాత్రలో ప్రముఖ హీరో దగ్గుబాటి రానా నటిస్తున్నారు. సాధారనంగా చంద్రబాబు అంటే తెల్ల గడ్డెంతోనే ఇప్పటి తరం చూస్తోంది. కానీ చంద్రబాబు ఒకప్పుడు గడ్డెం లేకుండా ఉండేవారు. ఇప్పుడు బాబు పాత్రను పోషిస్తున్న రానా గడ్డెం లేకుండా ఉన్న పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది. 

ntr

1984 సంవత్సరంలో టీపీడీ పార్టీలో చంద్రబాబు పోషించిన కీలక సంఘటనలకు సంబందించిన సన్నీవేశాలు ఎన్టీఆర్ సినిమాలో హైలెట్ గా ఉండనున్నాయని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ సినిమాలో చాలా మంది ప్రముఖ నటీనటులు ఉన్నారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు. శ్రీదేవి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తుండగా.. నాగేశ్వర్ రావు పాత్రలో సుమంత్ నటిస్తున్నారు. 

tags: ntr, ntr bio pic, ntr biopic, rana in ntr biopic, rana daggubati as a chandra babu, rana as a chandra babu, ntr bio pic movie

Related Post