మహేష్ బాబు అవకాశాన్ని ఆలీ కొట్టేశారు

news02 Feb. 25, 2019, 7:22 p.m. entertainment

ali

మహేశ్ బాబు కు వచ్చిన అవకాశాన్ని ఆలి కొట్టేశారట. యస్ మీరు విన్నది నిజమే. గతంలో మహేష్ బాబును హీరోగా పెట్టి సినిమా తీయాలనుకున్న ఓ దర్శకుడు.. అది కుదరకపోవడంతో చివరకు ఆలిని హీరోగా పెట్టి సినిమా తీశాడట. ఇంతకీ ఆ హీరో ఎవరు.. ఆ దర్శకుడు ఎవరు అనుకుంటున్నారా.. వాళ్లు మరెవరో కాదు.. ఆలి, యస్వీ కృష్ణారెడ్డి. యమలీల సినిమా మీకు గుర్తుంది కదా. అప్పట్లో అది పెద్ద హిట్ మూవీ. ఐతే ముందుగా యమలీల సినిమాను మహేష్ బాబుతో చేయాలని యస్వీ కృష్ణా రెడ్డి అనుకున్నారట. ఈమేరకు కృష్ణగారితో కూడా చర్చించారట.

ali mahesh

ఐతే అప్పటికి మహేష్ బాబు ఇంకా చదువుతున్న కారణంగా.. కృష్ణ గారు నో చెప్పారట. దీంతో యస్వీ కృష్ణా రెడ్డి చూపు కమేడియన్ ఆలి పై పడిందట. అలీని హీరోగా పెట్టి యమలీల సినిమా తీశారు. ఐతే ఆలీని హీరోగా పెట్టడమేంటని చాలా మంది యస్వీ కృష్ణారెడ్డిని హెచ్చరించారట. ఐనప్పటికీ.. యస్వీ కృష్ణా రెడ్డి ఆలీతోనే యమలీల సినిమా తీశారు. ఆ సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. ఆలీ తన నలబై ఏళ్ల సినీ కెరీర్ ను పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ విషయాన్ని పంచుకున్నాడు. అదన్నమాట సంగతి.

tags: ali, mahesh bau, mahesh babu, ali about mahesh babu, ali about yamaleela movie, ali about yamaleela movie chance, ali about mahesh babu movie chance

Related Post