చరణ్ తమ్ముడు పెద్దైపోయాడు..

news02 April 9, 2018, 8:08 p.m. entertainment

akeera birth day

సినిమా పిల్లర్- జనసేన అధినేత.. సినీ హీరో పవన్‌ కల్యాణ్‌ తన పిల్లలు అకీరా, ఆధ్యాతో కలిసి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఆదివారం అకీరా తన 14వ పుట్టినరోజు సందర్భంగా రాంచరణ్‌ తన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. అకీరాతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫోటోలో చరణ్‌, అకీరాతోపాటు పవన్‌, ఆధ్యా ఉన్నారు.

సాధారనంగా పవన్‌ కళ్యాణ్ వ్యక్తిగత ఫొటోలు చాలా తక్కువగా బయటికి వస్తుంటాయి. అలాంటిది అరుదుగా సోషల్‌ మీడియాలో కనిపించిన ఈ ఫొటో మెగా అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. చరణ్‌ పోస్ట్‌ కు చాలా రియాక్షన్స్‌, కామెంట్స్‌ వస్తున్నాయి.  అంతే కాదు ఒక అభిమానైతే ఏకంగా.. అకీరా పవన్‌ కంటే పొడవైపోయాడు, చరణ్‌ ఈ ఫొటో షేర్‌ చేసినందుకు ధన్యవాదాలు, తమ్ముడు కోసం ప్రత్యేకమైన పోస్ట్‌ పెట్టారు.. అని తన అభిమానాన్ని చాటుకున్నాడు

ఇక ఈ మధ్యే చరణ్‌ పుట్టినరోజు జరుపుకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్‌ కళ్యామ్.. చరణ్‌ ను కలిసి, శుభాకాంక్షలు చెప్పాడు. చాలా కాలం తరువాత చిరు కుటుంబంతో కలిసి విలువైన సమయాన్ని గడిపారు. ఈ మేరకు తీసిన ఫొటోలను అప్పుడు ఉపాసన, చరణ్ సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. ఐతే ఈ సందర్బంగానే పవన్ పిల్లలు సైతం చరణ్ పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్నారని ఫోటోలు చూస్తే అర్దమవుతోంది.

tags: akeera, akeera birth day, charan wishes to akeera,

Related Post