తప్పిపోయి మూడేళ్లవుతోంది

news02 Jan. 22, 2019, 7:35 a.m. entertainment

payal

యువ హీరోయిన్ పాయల్‌ రాజ్‌పుత్‌ తమ్ముడు గచ మూడేళ్ల నుంచి కనిపించడంలేదట. పాయల్ సోదరుడు ఇల్లు వదిలి వెళ్లి మూడేళ్లు అవుతోందని చెబుతూ ఆమె ఆవేధన వ్యక్తం చేస్తోంది. ఇదే విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ చేసింది. నా తమ్ముడు కనిపించడంలేదని... అతను మమ్మల్ని వదిలి వెళ్లి నేటికి మూడేళ్లు అవుతోందని... మూంబయిలో 2016 మార్చ్‌ 27న రాత్రి 7 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని... తన తమ్ముడి గురించి ఆలోచించకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నానని పాయల్ చెప్పుకొచ్చింది.

payal

తన తమ్ముడి కోసం పలు సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయింది పాయల్. తమ్ముడి పేరు ధృవ్‌ రాజ్‌పుత్‌ అని.. వయసు 25 సంవత్సరాలని చెబుతూ అతని ఫోటోను పోస్ట్ చేసింది. ఎవరైనా చూస్తే తమకు సమాచారం అందించాలని పాయల్ విజ్ఞప్తి చేసింది.

 

tags: payal, payal rajput, payal about her brother, payal rajput about her brother, payal hot

Related Post