శ్రీకాంత్ అలాంటి వాడనుకోలేదు..

news02 Oct. 12, 2018, 8:33 a.m. entertainment

nikisha

సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు సంబందించి జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారంతా ఒక్కొక్కరుగా నోరు విప్పుతున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో శ్రీరెడ్డి నుంచి మొదలైన ఈ వ్యవహారం బాలీవుడ్ వరకు పాకింది. తనుశ్రీ దత్తా  నానాపటేకర్ వివాదం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో.. మాజీ క్రికెటర్ శ్రీశాంత్, అందాల భామ నికిషాపటేల్ వ్యవహారం బయటకొచ్చింది.. ప్రస్తుతం బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్‌గా ఉన్నాడు శ్రీకాంత్. ఈ క్రమంలో తన భార్య భువనేశ్వరి కుమారితోపాటు తన గాళ్‌ఫ్రెండ్ గురించి కూడా చెప్పుకొచ్చాడు శ్రీతాంత్. 

nikisha

భువనేశ్వరిని ఏడేళ్లపాటు ప్రేమించి తర్వాత పెళ్లి చేసుకున్న విషయాన్ని బిగ్‌బాస్ షోలో స్పష్టం చేశాడు. ఇక శ్రీశాంత్ మాటలను విన్న హీరోయిన్ నికిషాపటేల్ అతడిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. శ్రీశాంత్‌తో బ్రేకప్ అయిన తర్వాత అతన్ని ఏ రోజూ తాను కలవలేదని నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నికీషా పటేల్. బిగ్‌బాస్ షోలో శ్రీకాంత్ చెప్పిన మాటలు విని ఆశ్చర్య పోయానని, తనతో సంవంత్సరం పాటు సహజీవనం ఎందుకు చేశాడని శ్రీకాంత్ ను ప్రశ్నించింది. ఇక గత ఐదేళ్లగా తన పని తాను చేసుకుంటున్నానని చెప్పింది నికిషా పటేల్.

tags: nikisha, nikisha patel, nikisha about srikanth, nikisha patel on srikanth, nikisha patel fire on srikanth, bollywood sexual harassment

Related Post